నేడు అలిగిన బతుకమ్మ

ABN , First Publish Date - 2020-10-21T09:17:56+05:30 IST

బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి (బుధవారం) నాడు ‘అలిగిన బతుకమ్మ’గా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో

నేడు అలిగిన బతుకమ్మ

బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి (బుధవారం) నాడు ‘అలిగిన బతుకమ్మ’గా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట! అందుకని ఈ రోజు బతుకమ్మ అలిగి ఏదీ తినదంటారు. కాబట్టి ఈ రోజు పూలతో బతుకమ్మలను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా ఏదీ సమర్పించరు. బతుకమ్మ అలక తీరాలని మహిళలు ప్రార్థిస్తారు.


ఏమేమి పువ్వొప్పునే... 
బతుకమ్మ సంబురాల్లో బాగా ప్రాచుర్యం పొందిన, మహిళలు ఎక్కువగా పాడుకొనే పాటల్లో ఒకటి:


ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ

ఏమేమి కాయొప్పునే గౌరమ్మ

తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ

తంగేడు కాయొప్పునే గౌరమ్మ


తంగేడు చెట్టు కింద ఆట

సిల్కలార పాట సిల్కాలారా

కల్కి సిల్కాలారా కందుమ్మ

గుడ్డలు రానువోను అడుగులు

తీరుద్ద ఆశలు తారు గోరంటలు


గణమైన పొన్న పువ్వే గౌరమ్మ

గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ

ఏమేమి కాయొప్పునే గౌరమ్మ

గుమ్మడి పువ్వొప్పునే గౌరమ్మ

గుమ్మడి కాయొప్పునే గౌరమ్మ


గుమ్మడి చెట్టు కింద ఆట

సిల్కలారా పాట సిల్కాలారా

కల్కి సిల్కాలారా కందుమ్మ గుడ్డలు

రానువోను అడుగులు

తీరుద్ద ఆశలు తారు గోరంటలు


గణమైన పొన్న పువ్వే గౌరమ్మ

గజ్జాల ఒడ్డానమే గౌరమ్మ

ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ

ఏమేమి కాయొప్పునే గౌరమ్మ

రుద్రాక్ష పువ్వొప్పునే గౌరమ్మ

రుద్రాక్ష కాయొప్పునే గౌరమ్మ

Updated Date - 2020-10-21T09:17:56+05:30 IST