తిరుపతి: తిరుమలలో కాలుష్య నివారణకు, రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజల్ ధరల భారం నుంచి విముక్తి కోసం ఎలక్ట్రిక్ వాహనాలు నడపాలన్న టీటీడీ సంకల్పానికి బీజం పడింది. ఇటీవల జరిగిన టీటీడీ సాధికార మండలి సమావేశంలోనూ ఎలక్ట్రిక్ కార్లకు ఆమోదం రాగానే దాదాపు 35 బ్యాటరీ వాహనాలు తిరుపతిలోని టాటా కంపెనీ షోరూంలో ప్రత్యక్షమవడం విశేషం. ప్రస్తుతం ఈ వాహనాలకు అడిషనల్ స్పేర్ పాట్స్ అమర్చుతున్నారు.