CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత మహిళా క్రికెట్‌ జట్టులో కరోనా కలకలం

ABN , First Publish Date - 2022-07-27T22:25:10+05:30 IST

కామన్వెల్త్‌ గేమ్స్‌లో పాల్గొనే భారత మహిళా క్రికెట్‌ జట్టులో కరోనా కలకలం రేగింది. ఆంధ్రకు చెందిన సబ్బినేని మేఘనతో..

CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత మహిళా క్రికెట్‌ జట్టులో కరోనా కలకలం

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ గేమ్స్‌లో (Commonwealth Games) పాల్గొనే భారత మహిళా క్రికెట్‌ జట్టులో (Indian Women's Cricket Team) కరోనా (Corona) కలకలం రేగింది. ఆంధ్రకు చెందిన సబ్బినేని మేఘనతో (S Meghana) పాటు పూజా వస్త్రాకర్‌ (Pooja Vastrakar) పాజిటివ్‌గా తేలారు. దీంతో వారు స్వదేశంలోనే ఉండిపోగా.. హర్మన్‌ప్రీత్‌ సేన (Harmanpreet Kaur) ఆదివారమే ఇంగ్లండ్‌ వెళ్లింది. ముందుగా ఒక్కరే అనుకున్నప్పటికీ ఆ తర్వాత పరీక్షలో మరో క్రికెటర్‌ కూడా పాజిటివ్‌గా తేలిందని ఐఓఏ తెలిపింది. ప్రొటోకాల్‌ ప్రకారం ఈ ఇద్దరికీ నెగెటివ్‌ రిజల్ట్‌ వచ్చాకే జట్టుతో కలుస్తారు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే భారత్‌ తొలి మ్యాచ్‌కు వీరు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. చిరకాల ప్రత్యర్థి జట్టు అయిన పాకిస్తాన్‌తో జులై 31న భారత మహిళా క్రికెట్ జట్టు తలపడనుంది. బార్బడోస్ ఫైనల్ లీగ్ మ్యాచ్ ఆగస్ట్  3న జరగనుంది. ఫైనల్‌తో సహా అన్ని మ్యాచ్‌లు ఎడ్జ్‌బాస్టన్‌లోనే జరగబోతున్నాయి. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే అమ్ముడయిపోయినట్లు నిర్వాహకులు తెలిపారు.



ఇదిలా ఉండగా.. కామన్వెల్త్‌ క్రీడలకు ముందు భారత్‌కు అతిపెద్ద షాక్‌ తగిలింది. కచ్చితంగా స్వర్ణం గెలుస్తాడనే భారీ అంచనాలున్న స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా టోర్నమెంట్‌ నుంచి తప్పుకొన్నాడు. గత వారమే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన 24 ఏళ్ల నీరజ్‌.. గాయం కారణంగా బర్మింగ్‌హామ్‌ క్రీడల్లో పాల్గొనడం లేదని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) కార్యదర్శి రాజీవ్‌ మెహతా మంగళవారం వెల్లడించాడు. అమెరికాలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో జావెలిన్‌ విసిరే సమయంలో నీరజ్‌ గజ్జల్లో గాయంతో బాధపడ్డ సంగతి తెలిసిందే.

Updated Date - 2022-07-27T22:25:10+05:30 IST