బట్టేపాడులో సంక్షేమ పథకాలపై వివరిస్తున్న విక్రమ్‌రెడ్డి
ఆత్మకూరు, మే 16: మండలంలోని బట్టేపాడులో నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఆయన తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డితో కలిసి సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా వారు స్థానిక నాయకులతో కలిసి సచివాలయాన్ని సందర్శించారు. తరువాత ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.