ఆయనకు ముగ్గురు!

ABN , First Publish Date - 2021-05-09T05:30:00+05:30 IST

అనగనగా ఓ చీరల వ్యాపారి. అతని పేరు రామస్వామి. శ్రీరామచంద్రుడిలా ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని ఆశిస్తాడు. అలాగే, వీధుల్లో నగల వ్యాపారం చేసే జయప్రదను పెళ్లి చేసుకుంటాడు...

ఆయనకు ముగ్గురు!

అనగనగా ఓ చీరల వ్యాపారి. అతని పేరు రామస్వామి. శ్రీరామచంద్రుడిలా ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోవాలని ఆశిస్తాడు. అలాగే, వీధుల్లో నగల వ్యాపారం చేసే జయప్రదను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత మరో ఇద్దర్ని పెళ్లి చేసుకుంటాడు. ఇలా ముగ్గుర్ని పెళ్లి చేసుకున్న అతని కథేంటో ‘బట్టల రామస్వామి బయోపిక్కు’లో చూడమని దర్శకుడు రామ్‌ నారాయణ్‌ కోరారు. ఆయన దర్శకత్వం వహించిన చిత్రమిది. ఈ నెల 14న ‘జీ 5’ ఓటీటీలో ఎక్స్‌క్లూజివ్‌గా విడుదల కానుంది. రామస్వామిగా అల్తాఫ్‌ హసన్‌, ముగ్గురు కథానాయికలుగా శాంతి రావ్‌, సాత్విక, లావణ్యారెడ్డి నటించారు. ఇదొక న్యూ ఏజ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ అని నిర్మాతలు సతీశ్‌కుమార్‌ ఐ, రామకృష్ణ వీరపనేని చెప్పారు.


Updated Date - 2021-05-09T05:30:00+05:30 IST