హైదరాబాద్‌ నడిబొడ్డున గబ్బిలాల చెట్లు

ABN , First Publish Date - 2020-05-22T20:25:01+05:30 IST

నగరంలోని నడిబొడ్డున చెట్లపై గబ్బిలాలు నివాసం ఏర్పాటు చేసుకున్నాయి.

హైదరాబాద్‌ నడిబొడ్డున గబ్బిలాల చెట్లు

హైదరాబాద్: నగరంలోని నడిబొడ్డున చెట్లపై గబ్బిలాలు నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. పచ్చటి చెట్ల నిండా నల్లటి గబ్బిలాలు వేలాడుతున్నాయి. నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద చెట్లపై గబ్బిలాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కుప్పలు, తెప్పలుగా వచ్చిన గబ్బిలాలను చూసి జనం హడలిపోతున్నారు. లాక్ డౌన్ నుంచి బయటపడుతున్న సమయంలో గబ్బిలాలు జనాలకు షాక్ ఇస్తున్నాయి. వాటి అరుపులు భయానకంగా ఉన్నాయి. అటు కరోనా.. ఇటు గబ్బిలాల మధ్య ప్రజలు వణుకుతున్నారు. అయితే కరోనాను లెక్కచేయకుండా కొంతమంది పక్షి ప్రేమికులు వాటిని వీక్షిస్తున్నారు.

Updated Date - 2020-05-22T20:25:01+05:30 IST