ఆవాస ప్రాంతాల్లో గబ్బిలాలు

ABN , First Publish Date - 2020-08-10T08:37:37+05:30 IST

గబ్బిలం పేరు చెబితేనే ప్రపంచాన్ని వ ణికిస్తున్న కరోనా మహమ్మారి గుర్తుకొచ్చి గుబులు పుట్టిస్తుంది. ఇందుకు కా రణం..

ఆవాస ప్రాంతాల్లో గబ్బిలాలు

భీతిల్లుతున్న ప్రజలు..

కరోనా నేపథ్యంలో ఆందోళన 


 కళ్యాణదుర్గం, ఆగస్టు9 :  గబ్బిలం పేరు చెబితేనే ప్రపంచాన్ని వ ణికిస్తున్న కరోనా మహమ్మారి గుర్తుకొచ్చి గుబులు పుట్టిస్తుంది. ఇందుకు కా రణం... చైనాలో గబ్బిలాల నుంచే కరోనా వ్యాపిస్తోందని మొదట్లో ప్రచారం జరగడమే. మరి ఆ గబ్బిలాలు ఇళ్ల వద్దే గుంపులు చేరితే స్థానికుల పరిస్థితి ఏమిటి? మన దేశంలో గబ్బిలాల నుంచి ఎటువంటి ప్రమాదం లేదని కీటక శాస్త్ర వేత్తలు చెబుతున్నా ప్రజల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు.


గ్రామీణ ప్రాంతాల్లో సీకురేవులు అని కూడా అంటారు. ఒకప్పుడు వెతికితేకాని కనిపించని గబ్బిలాలు ప్రస్తుతం పట్టణ, గ్రామాల మధ్య చెట్లకు వేలాదిగా కనిపిస్తున్నాయి. కళ్యాణదుర్గం పట్టణంలోని పార్వతీనగర్‌, నియోజకవర్గంలోని బ్రహ్మసముద్రం, శెట్టూరు, కంబదూరు, కుందుర్పి మండల కేంద్రాల్లో ఉన్న చింత చెట్లలో గబ్బిలాలు అధిక సంఖ్యలో కనిపిస్తున్నాయి.


వాటి శబ్దాలు కూడా ఇబ్బంది కలిగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పంటలకు క్రిమి సంహారక మందులు వాడడం వల్లే కాలుష్యం పెరిగి,  గబ్బిలాలు జనవాసాల మధ్య చెట్లపై చేరుతున్నాయని కీటక శాస్త్రనిపుణులు అంటున్నారు. గతంలో వాటి ఎముకలు చిన్నపిల్లల మొలతాడుకు కడితే వారికి ఎలాంటి వ్యాధులు సోకవన్నది ప్రజల్లో ప్రగాఢ నమ్మకం. కానీ  వృద్ధులు, చిన్నపిల్లల మీదే కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో, ఇప్పుడు వాటిని చూస్తూనే భ యాందోళ చెందుతున్నారు. జనవాసాల మధ్య ఉన్న గబ్బిలాలను పా రదోలాలని పలు ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. 


గబ్బిలాలు ప్రమాదం కాదు..రాజేష్‌ , కీటక శాస్త్ర వేత్త 

మన దేశంలోని గబ్బిలాలు ప్రమాదం కాదు. కాలుష్యంలేని ప్రాంతాల్లో ఉ న్న చెట్లపై అవి చేరుతాయి. దీని వల్ల ప్రజలకు ఎలాంటి హాని జరగదు, వైరస్‌ సోకదు. జనవాసాల మధ్య గబ్బిలాలు ఉండడంతో వాటి శబ్ధాలవల్ల ప్రజలకు కొంత అంతరాయం ఏర్పడడం సహజం. అయితే గబ్బిలాలను చూసి ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. 

Updated Date - 2020-08-10T08:37:37+05:30 IST