ఆటతో భవిష్యత్‌కు బంగారు బాట

ABN , First Publish Date - 2022-08-08T05:08:42+05:30 IST

ఆట భవిష్యత్‌కు బంగారు బాట అని కలెక్టర్‌ గౌతమ్‌, పోలీస్‌ కమిష నర్‌ విష్ణు ఎస్‌. వారియర్‌ పేర్కొన్నారు.

ఆటతో భవిష్యత్‌కు బంగారు బాట
బాలికల సింగిల్స్‌ విజేతకు బహుమతులు ప్రధానం చేస్తున్న కలెక్టర్‌, సీపీ

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల ముగింపులో కలెక్టర్‌, సీపీ

విజేతలకు బహుమతుల అందజేత

ఖమ్మం స్పోర్ట్స్‌, ఆగస్టు 6: ఆట భవిష్యత్‌కు బంగారు బాట అని కలెక్టర్‌ గౌతమ్‌, పోలీస్‌ కమిష నర్‌ విష్ణు ఎస్‌. వారియర్‌ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వ ర్యం లో నగరంలోని సర్ధార్‌ పటేల్‌ ఇండోర్‌ స్టేడియంలో ఎనిమిదో రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే క్రీడల్లో తర్ఫీదు పొందాలని అన్నారు. క్రీడాకారులకు భవిష్యత్‌లో క్రీడా కోటాలో ఉద్యోగాలు వస్తాయని అన్నారు. క్రీడల్లో రాణించడం ద్వారా అంతర్జాతీయంగా గుర్తింపు లభిస్తుందని అన్నా రు. ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని అన్నారు. హైదరాబాద్‌ తరువాత ఖమ్మం నగరంలో క్రీడా వసతులు బాగున్నాయని అన్నారు. అంతర్జాతీయంగా క్రీడలలో పతకా ల పట్టికలో మన దేశం కోటా ఎక్కువగా ఉండాలంటే క్రీడలలో రాణించడం ద్వారా సాధ్యమ వుతుందని అన్నారు. జిల్లాలో క్రీడలను, స్టేడియాలను మరింతగా అభివృధ్ధి చేస్తామని తెలిపా రు. అనంతరం పోటీల విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర బ్యా డ్మింటన్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు, ఏసీపీ ఘంటా వెంకట్రావు, జిల్లా సంఘం అధ్యక్ష, కార్యద ర్శులు తమ్మినేని వెంకట్రావు, ఉప్పల్‌రెడ్డి, ట్రెజరర్‌ చంద్రశేఖర్‌, డీవై ఎస్‌వో పరంధామరెడ్డి, కర్నాటి వీరభద్రం, మురళి ఉన్నారు.


Updated Date - 2022-08-08T05:08:42+05:30 IST