Jul 23 2021 @ 23:50PM

మౌనంగా ఉంటున్నానని ముని అనుకోవద్దు!

విరాన్‌ ముత్తంశెట్టి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘బతుకు బస్టాండ్‌’. నికితా అరోరా, శృతీ శెట్టి హీరోయిన్లు. సినిమా చిత్రీకరణ పూర్తయింది. త్వరలో విడుదల చేయాలనుకుంటున్నారు. శుక్రవారం ట్రైలర్‌ విడుదల చేశారు. ‘‘మౌనంగా ఉంటున్నానని ముని అనుకుంటున్నావేమో... నాలో ఒక విశ్వామిత్రుడు కూడా ఉండి ఉండవచ్చు’ అని హీరో చెప్పిన డైలాగ్‌, హీరోయిన్లతో సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ‘నా చావుకు కారణం మా అమ్మానాన్న’ అని హీరో చెప్పే డైలాగ్‌ ఆసక్తి కలిగించింది. చిత్రనిర్మాతలు ఐ. కవితారెడ్డి, కె. మాధవి మాట్లాడుతూ ‘‘విరాన్‌కు తొలి చిత్రమైనా... చాలా చక్కగా నటించాడు. ఫైట్లు కష్టపడి చేశాడు. కొత్త కథతో పాటు వాణిజ్య హంగులన్నీ ఉన్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన రెండు పాటలు, తాజా ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు.