బతుకమ్మ చీరల పంపిణీకి చర్యలు: ktr

ABN , First Publish Date - 2021-10-02T22:17:35+05:30 IST

బతుకమ్మ చీరల పంపిణీకి అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో

బతుకమ్మ చీరల పంపిణీకి చర్యలు: ktr

హైదరాబాద్: బతుకమ్మ చీరల పంపిణీకి అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 18 ఏళ్లు నిండి, ఆహార భద్రత కార్డ్ ఉన్న ప్రతి ఒక్క అడబిడ్డకూ బతుకమ్మ చీర ఇస్తామని తెలిపారు. 2017 నుంచి గత ఎడాదిదాకా 3.90 కోట్ల చీరలను పంపీణీ చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది 30 సరికొత్త డిజైన్లలో 20 విభిన్న రంగులతో కలిపి మొత్తం 810 రకాల చీరల పంపిణీ జరుగుతుందని కేటీఆర్‌ తెలిపారు. 


నేత కార్మికులకు ఉపాధి కల్పించడం, మహి ళలకు పండగ కానుక అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న బతు కమ్మ చీరల పంపిణీకి అంతా సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి అర్హులైన తెల్లరేషన్‌కార్డు కలిగి, 18సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు బతుకమ్మ చీర అందించ నున్నారు. జిల్లాలో గ్రామీణ, మున్సిపాలిటీ, జీహెచ్‌ఎంసీ కలుపుకుని 7,28,154 మంది అర్హులుగా గుర్తించారు. ఇందుకు సంబంధించి 4,31,000 చీరలను కేటాయించారు. ఈనెల 29వరకు 3,96,880 చీరలు జిల్లాకు చేరుకున్నాయి. 

Updated Date - 2021-10-02T22:17:35+05:30 IST