బతుకమ్మకు ఖండాంతర ఖ్యాతి ఘనత టీఆర్‌ఎస్‌దే

ABN , First Publish Date - 2022-10-04T06:09:14+05:30 IST

బతుకమ్మ వేడుకలకు ఖండాతర ఖ్యాతి అందుతున్న ఘనత టీఆర్‌ఎస్‌ సర్కారుదేనని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

బతుకమ్మకు ఖండాంతర ఖ్యాతి   ఘనత టీఆర్‌ఎస్‌దే
బతుకమ్మ పేర్చుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

 మంత్రి కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): బతుకమ్మ వేడుకలకు ఖండాతర ఖ్యాతి అందుతున్న ఘనత టీఆర్‌ఎస్‌ సర్కారుదేనని రాష్ట్ర సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సోమవారం కరీంనగర్‌ క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ నిమజ్జనోత్సవం పురస్కరించుకొని తన సతీమణి స్నేహలత కుటుంబ సభ్యుల తో కలిసి బతుకమ్మ పేర్చారు. ఈ సందర్బంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడారు. ఏ పండుగ చేసినా, ఏ పూజలు చేసినా పూలు వినియోగిస్తారని కానీ ఆ పూలను దేవతగా కొలిచే పం డుగ బతుకమ్మ వేడుకలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు వురు కుటుంబ సభ్యులు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-10-04T06:09:14+05:30 IST