భక్తిప్రపత్తులతో బతుకమ్మ వేడుకలు

ABN , First Publish Date - 2022-10-03T06:08:02+05:30 IST

జిల్లా వ్యాప్తంగా బతుకమ్మకు మహిళలు భక్తిప్రపత్తులతో పూజలు నిర్వహిస్తున్నా రు. ఆదివారం వేడుకలు ఎనిమిదవ రోజుకు చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకుంటున్నారు. ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలలో వేడుకలు ఘనంగా సాగుతున్నాయి.

భక్తిప్రపత్తులతో బతుకమ్మ వేడుకలు

నిజామాబాద్‌కల్చరల్‌, అక్టోబరు 2: జిల్లా వ్యాప్తంగా బతుకమ్మకు మహిళలు భక్తిప్రపత్తులతో పూజలు నిర్వహిస్తున్నా రు. ఆదివారం వేడుకలు ఎనిమిదవ రోజుకు చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో మహిళలు బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకుంటున్నారు. ఆలయాలు, ప్రభుత్వ కార్యాలయాలలో వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ గ్రౌండ్‌లో ‘మెప్మా’ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పీ చైర్మన్‌ దాదన్నగారి విఠల్‌రావు, మేయర్‌ నీతుకిరణ్‌, అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ హాజరయ్యారు. నుడా చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, మెప్మా పీడీ రాములు, ఆర్‌డీవో రవి, టీఎన్‌జీవోస్‌ జిల్లా అధ్యక్షుడు అలుక కిషన్‌, కార్యదర్శి అమృత్‌కుమార్‌, టీఎన్‌జీవోస్‌, జాగృతి నాయకులు పాల్గొన్నారు.

నేడు సద్దుల బతుకమ్మ ..

పూల పండుగలో చివరి రోజుగా ఆడపడుచులు జరుపుకునేది సద్దుల బతుకమ్మ. ఐదురకాలుగా సద్దులు (భోజనం) తయారుచేసి గౌరీదేవికి నివేదించడమే ఈ సద్దుల పండుగ ముఖ్య ఉద్దేశం. చింతపండు, నువ్వులు, కొబ్బరి, నిమ్మకాయ వంటి వాటితో ఈ సద్దులను తయారుచేస్తారు. 9వ రోజున గౌరమ్మకు విశేష పూజలు నిర్వహించి ఐదు రకాల సద్దులతో పాటు వివిధ రకాల పిండి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. జిల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయా గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రం ఖిల్లా ప్రాంతంలోని బొడ్డెమ్మ చెరువు, పూలాంగ్‌, నీలకంఠేశ్వర ఆలయం, మాధవనగర్‌ చెరువు, అయోధ్యనగర్‌, బోర్గాం(పి), ఎల్లమ్మగుట్ట, తదితర ప్రాంతాల్లో నగరపాలకసంస్థ విద్యుత్‌ దీపాలు, బతుకమ్మ నిమజ్జనం చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2022-10-03T06:08:02+05:30 IST