ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు

ABN , First Publish Date - 2022-09-26T04:06:48+05:30 IST

జిల్లాకేంద్రంతోపాటు అన్ని మండలాల్లో ఆదివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తీరొక్కపూలతో బతుకమ్మను పేర్చి మహి ళలు భక్తి శ్రద్ధలతో గౌరవమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మ ఆడిపాడారు.

ఘనంగా ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు
ఆసిఫాబాద్‌ చిల్డ్రన్స్‌ పార్క్‌లో బతుకమ్మ ఆడుతున్న అదనపు కలెక్టర్‌, ట్రైనీ కలెక్టర్లు

ఆసిఫాబాద్‌/బెజ్జూరు/దహెగాం/కెరమెరి/పెంచికలపేట/కౌటాల/సిర్పూర్‌(టి)/తిర్యాణి, సెప్టెంబరు 25: జిల్లాకేంద్రంతోపాటు అన్ని మండలాల్లో ఆదివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తీరొక్కపూలతో బతుకమ్మను పేర్చి మహి ళలు భక్తి శ్రద్ధలతో గౌరవమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మ ఆడిపాడారు. ఆలయాల వద్ద, పట్టణంలోని ప్రధాన కూడళ్లలో మహిళలు పెద్దసంఖ్యలో బతు కమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. బెజ్జూరు, దహెగాం, కెరమెరి, పెంచికలపేట, కౌటాల, సిర్పూర్‌(టి), తిర్యాణి మండలాల్లో ఆదివారం బతుకమ్మ వేడుక లను ఘనంగా ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో బతుకమ్మలను వివిధపూలతో అలంకరించి మహిళలు, చిన్నారులు ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ ఆడి పాడారు. అనంతరం వెంటతెచ్చుకున్న సత్తుపిండిని వాయినాలుగా ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకున్నారు.

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పట్టణంలో ఆదివారం బతుకమ్మ ఆటలు అంబరాన్నంటాయి. సర్‌సిల్క్‌ కాలనీ, రాంమందిర్‌సమీపంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ ఆటల్లో సిర్పూరు ఎమ్మెల్యే కోనేరు రమాదేవి బతుకమ్మ ఆడారు. అలాగే సుభాష్‌ చంద్రబోస్‌ కాలనీ, గాంధీచౌక్‌, మార్కెట్‌ఏరియా, ఇండస్ట్రీరియల్‌ ఏరియాలతోపాటు వివిధకాలనీల్లో బతుకమ్మ ఆట లను మహిళలు ఆడారు. బతుకమ్మ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. 

Updated Date - 2022-09-26T04:06:48+05:30 IST