ఒక్కేసి పువ్వేసి చందమామ..

ABN , First Publish Date - 2020-10-25T06:18:17+05:30 IST

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.

ఒక్కేసి పువ్వేసి చందమామ..

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు 


జిల్లాలోని ఆయా మండలాల్లో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఒక్కేసి పువ్వేసి చందమామ అంటూ ఆడి పాడి సమీపంలోని చెరువులు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. 


ఆసిఫాబాద్‌ రూరల్‌/కాగజ్‌నగర్‌/రెబ్బెన/వాంకిడి/లింగాపూర్‌/కెరమెరి/సిర్పూర్‌(టి)/దహెగాం/బెజ్జూరు/చింతలమానేపల్లి/పెంచికలపేట, అక్టోబరు 24: కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన బతుకమ్మ వేడుకలు శనివారం నాటితో ముగిశాయి. తీరొక్క పూలతో బతుకమ్మలను అందంగా అలంకరిం చారు. గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని బజార్‌వాడీ, జన్కాపూర్‌, హడ్కో కాలనీ, బ్రాహ్మణ్‌వాడ, బాపునగర్‌, కంచుకోట, చెక్‌ పోస్టు కాలనీ, రాజంపేట, సాయినగర్‌, పైకాజీనగర్‌, తదితర కాలనీల్లో బతుకమ్మలను ఉంచి ఆడిపాడారు.


అనంతరం స్థానిక పెద్దవాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. బతుకమ్మ వేడుకలను పురస్కరించుకుని పెద్దవాగుకు వెళ్లే రహదారి గుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్‌ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా మహిళలు  నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా వివిధ పూలతో ఆలంకరించిన బతుకమ్మలను తీసుకొచ్చి ఆటలు, పాటలు పాడారు.  సర్‌సిల్క్‌ ఏరియాలోఏర్పాటు చేసిన బతుకమ్మ వద్ద ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి కోనేరు రమాదేవి  బతుకమ్మలతోవచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలతో బతుకమ్మ ఆటలు ఆడారు. అలాగే పలు వార్డుల్లో కూడా ప్రత్యేకంగా బతుకమ్మ వద్ద మహిళలు ఆడి పాడారు. కార్యక్రమంలో కోనేరుచారిటబుల్‌ ట్రస్టు ఛైర్మన్‌ కోనేరు వంశీ, ఆయా వార్డు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.  రెబ్బెన మండల కేంద్రం తో పాటు గ్రామాల్లో, సింగరేణి పారిశ్రామిక ప్రాంతమైన గోలేటిలో మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గోలేటిలో సింగరేణి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం సమీప వాగుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. వాంకిడి మండ లంలో మహిళలు శనివారం సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.


  అనంతరం సమీప చెరువులు, వాగుల్లో బతుక మ్మలను నిమజ్జనం చేశారు. లింగాపూర్‌ మండలంలో సద్దుల బతుక మ్మను ఘనంగా నిర్వహించారు. వారం రోజులుగా నిర్వహిస్తున్న బతుకమ్మ సంబరాలు సద్దుల బతుకమ్మతో ముగిశాయి.  కెరమెరి మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా జరుపుకున్నారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకుని గ్రామాల్లో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. సిర్పూర్‌(టి) మండలంలో మహిళలు మహిళలను పూలను సేకరించి అందంగా పేర్చి కాలనీల్లో ప్రధాన కూడళ్లలో ఒక్కచోటికి చేరి ఆడిపారు. అనంతరం మండల కేంద్రంలోని నాగమ్మ చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. దహెగాం మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో మహిళలు సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే మహిళలను పూలను సేకరించి అందంగా పేర్చి కాలనీల్లో ప్రధాన కూడళ్లలో ఒక్కచోటికి చేరి ఆడిపాడారు.


అనంతరం వాగులు, చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.  బెజ్జూరు మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. చింతలమానేపల్లి మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. మండలంలో అన్ని గ్రామాల్లో మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా తయారు చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మల వద్ద మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా ఆడి పాడుతూ పాటలు పాడారు. పెంచికలపేట మండల వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. 

Updated Date - 2020-10-25T06:18:17+05:30 IST