Abn logo
Oct 25 2020 @ 00:44AM

అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

Kaakateeya

ఘనంగా సద్దుల బతుకమ్మ

తీరొక్క పూలతో అలరించిన బతుకమ్మలు 

కూడళ్ళు, ఆలయాల్లో ఆటాపాట

చెరువుల్లో నిమజ్జనం


మందమర్రిటౌన్‌, అక్టోబరు 24: బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లాలో శనివారం సద్దుల బతుకమ్మ వైభవంగా జరిగింది. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలు పేర్చారు. తంగేడు, గునుగు, టేకు, గుమ్మడి, కలువ, బంతిపూలతో బతుకమ్మలను తయారు చేసి గౌర మ్మతో పూజించారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు బతుకమ్మను పేర్చారు. సద్దుల బతుకమ్మ సందర్భంగా పూలు కొనేందుకు వచ్చిన ప్రజలతో మార్కెట్‌ కిటకిటలాడింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర రోడ్డు కు రెండు వైపులా పూలు విక్రయించారు. ఆయా కాలనీల్లో  బతుకమ్మ ఘాట్‌ల వద్ద బతుకమ్మలు ఆడారు. కోలాటాలు ఆడుతూ బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.  జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు బతుకమ్మ ఆడా రు. సీతారామాలయం, హనుమాన్‌ ఆలయం, శివకేశవాల యంతోపాటు కాలనీల్లో ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. అనంతరం బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేశారు. 


కాసిపేట: మండలంలో సద్దుల బతుకమ్మ వేడుకలు  ఘనంగా జరిగాయి. దేవాపూర్‌, కాసిపేట, సోమగూడెం, మల్కేపల్లిలో రంగు రంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి గౌరమ్మను పూజలు చేశారు.  


బెల్లంపల్లిటౌన్‌ : బతుకమ్మ వేడుకలు అంబరాన్నం టాయి.  సింగరేణి ఏఎంసీ 2 క్రీడా మైదానంలో సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. బెల్లంపల్లి బస్తీ పోచమ్మ చెరువు వద్ద ఏర్పాట్లు చేయగా పెద్ద సంఖ్యలో మహిళలు  చేరుకొని బతుకమ్మ ఆడారు. పలు కాలనీలు, మేయిన్‌ బజార్‌, ఏఎంసీ, కాల్‌టెక్స్‌, స్టేషన్‌రోడ్‌ కాలనీ, తదితర ప్రాంతాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో బతుకమ్మ ఆటలు ఆడారు. పిల్లల నుంచి పెద్దల వరకు  వయస్సుతో బేధం లేకుండా సంబరాల్లో పాల్గొన్నారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జక్కుల శ్వేత, కమిషనర్‌ ఆకుల వెంకటేష్‌, వైస్‌చైర్మన్‌ బత్తుల సుదర్శన్‌ పరిశీలించారు. ఏసీపీ ఎంఎ రహెమాన్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.  


దండేపల్లి: మండలంలో సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. రంగు రంగుల పూలతో  బతుకమ్మను  అ లంకరించి ప్రత్యేక పూజలు చేశారు. కూడళ్ళలో బతుకమ్మ ఆడిన అనంతరం చెరువులు, వాగులో నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. ఎమ్మెల్యే నడిపెల్లి దివాక ర్‌రావు బతుకమ్మ ఆడుతున్న మహిళల వద్దకు వెళ్లి శుభా కాంక్షలు తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్‌ గురువయ్య, లింగన్న,  చుంచు శ్రీనివాస్‌, భూమన్న, సత్తయ్య, లింగారెడ్డి, రమేష్‌, రాజమల్లు, సత్తయ్య, మల్లేష్‌ పాల్గొన్నారు.  


హాజీపూర్‌: హాజీపూర్‌లో సద్దుల బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచి తంగేడుపూలు, వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి సాయంత్రం బతుకమ్మను ఆడారు.  


జన్నారం: కవ్వాల్‌, ఇందన్‌పల్లి, మురిమడుగు, కలమడు గు, వెంకటాపూర్‌, జన్నారం, నర్సింగాపూర్‌ గ్రామాలలో మహిళలు బతుకమ్మ ఆడారు. రంగు రంగుల పూలతో ఆక ర్షనీయంగా బతుకమ్మలను పేర్చి, చిన్న పెద్ద తేడాలేకుండా మహిళలు బతుకమ్మ ఆడారు. 


శ్రీరాంపూర్‌ : శ్రీరాంపూర్‌ శాంతి స్డేడియంలో సింగరేణి  యాజమాన్యం బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు చేసింది. మహిళలు బతుకమ్మలతో తరలి వచ్చి గౌరమ్మలను పూ జించారు. నిమజ్జనం అనంతరం వాయినాలు ఇచ్చి పుచ్చు కున్నారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు, జీయం లక్ష్మీనారాయణ,  అత్తి సరోజ,  కే. సురేందర్‌ రెడ్డి, డి అన్నయ్య, ఏనుగు రవిందర్‌రెడ్డి, కె. సరళా దేవి, మున్సిపల్‌ చైర్మన్‌ ప్రభాకర్‌, వైస్‌ చైర్మన్‌ తోట శ్రీనివాస్‌ పలువురు బతుకమ్మ వేడుకలను సందర్శించి ఉత్తమ బతుకమ్మలకు బహుమతులు అందజేశారు. బంగ్లాస్‌ ఏరియాలో సింగరేణి అధికారుల కుటుంబాలు బతుకమ్మ సంబరాలను వైభవంగా జరుపుకున్నారు. మాజీ సర్పంచ్‌ యం. రాజేంద్రపాణి, మున్సిపల్‌ కమిషనర్‌ రాదాకిషన్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. 


కోటపల్లి: కోటపల్లిలో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. ఎంఎల్‌సీ పురాణం సతీష్‌కుమార్‌  సతీమణి సునంద, ఎంపీపీ మంత్రి సురేఖలతో పాటు పలువురు మహిళలు పాల్గొన్నారు. ఆలయాలు, కూడళ్ళ వద్ద మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ, కోలాటాలు ఆడా రు. చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు.  

Advertisement
Advertisement