బతుకమ్మ బండ కబ్జా!

ABN , First Publish Date - 2022-07-04T05:08:32+05:30 IST

మండలంలో ప్రభుత్వ భూములను కొందరు దర్జాగా కబ్జా చేస్తున్నారు. రాత్రికి రాత్రి యంత్రాలతో భూములను చదునుచేసి సాగు చేసుకుంటున్నారు. మండల కేంద్రంలో 387 సర్వే నంబర్‌లో 670 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. గతంలో ఈ సర్వే నంబర్‌లో కొంత భూమిని ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది. ప్రస్తుతం దరలు పెరగడంతో భూములపై కన్నేసిన అక్రమార్కులు గుట్టలను సైతం

బతుకమ్మ బండ కబ్జా!
బతుకమ్మ బండ వద్ద చదును చేసిన భూమి

అక్కన్నపేట తహసీల్దార్‌ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ప్రభుత్వ భూముల ఆక్రమణ


అక్కన్నపేట, జూలై 3: మండలంలో ప్రభుత్వ భూములను కొందరు దర్జాగా కబ్జా చేస్తున్నారు. రాత్రికి రాత్రి యంత్రాలతో భూములను చదునుచేసి సాగు చేసుకుంటున్నారు. మండల కేంద్రంలో 387 సర్వే నంబర్‌లో 670 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. గతంలో ఈ సర్వే నంబర్‌లో కొంత భూమిని ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసింది. ప్రస్తుతం దరలు పెరగడంతో భూములపై కన్నేసిన అక్రమార్కులు గుట్టలను సైతం వదలకుండా ఎక్స్‌కవేటర్లతో చదును చేస్తున్నారు. ప్రస్తుతం అద్దె భవనంలో కొనసాగుతున్న తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న బతుకమ్మ బండ వద్ద దాదాపు 30 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఇందులో కొంత భాగంలో దర్జాగా హద్దురాళ్లను సైతం పాతారు. తాతల కాలం నుంచి బతుకమ్మ బండ వద్దనే అక్కన్నపేటకు చెందిన మహిళలు బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు. ప్రస్తుతం ఆ స్థలం తనదేనని గ్రామానికి చెందిన ఓ రైతు చదునుచేసి పంటలను సాగు చేస్తున్నారు. మరికొందరు కూడా గతంలో ఉన్న రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని అక్రమ పట్టాలు చేయించుకున్నారు. ప్రస్తుతం ఆ భూములను విక్రయిస్తున్నారు. ఇందుకు రెవెన్యూ సిబ్బంది సహకారిస్తున్నారనే ఆరోపణు వినిపిపిస్తున్నాయి. అయితే కబ్జాకు గురైన బతుకమ్మ బండ భూములను కాపాడాలని ఎంపీటీసీ పెసరు సాంబరాజుతో కలిసి గ్రామస్థులు శనివారం తహసీల్దార్‌ సంజీవ్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. 


సర్వే జరిపిస్తాం : సంజీవ్‌ కుమార్‌, తహసీల్దార్‌, అక్కన్నపేట

అక్కన్నపేటలోని 387 సర్వే నంబర్‌లో ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఇటీవల గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సర్వేయర్‌ అందుబాటులో లేరు. త్వరలోనే సర్వేయర్‌, డీఐని పిలిపించి ప్రభుత్వ భూములను సర్వే చేయిస్తాం. 

Updated Date - 2022-07-04T05:08:32+05:30 IST