బొమ్మకల్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

ABN , First Publish Date - 2020-10-23T10:50:41+05:30 IST

బొమ్మకల్‌, కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌, ఖాజీపూర్‌ గ్రామాల్లో మహిళలు ఆనందోత్సహాల మధ్య సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు

బొమ్మకల్‌లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు

ఆసిఫ్‌నగర్‌లో బతుకమ్మ ఆడిన ఎంపీపీ పిల్లి శ్రీలతమహేష్‌


కరీంనగర్‌ రూరల్‌, అక్టోబరు 22: బొమ్మకల్‌, కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌, ఖాజీపూర్‌ గ్రామాల్లో  మహిళలు ఆనందోత్సహాల మధ్య సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్‌లో మండలాధ్యక్షురాలు పిల్లి శ్రీలతమహేష్‌ బతుకమ్మ వేడకల్లో పాల్గొన్నారు. బొమ్మకల్‌లో కరీంనగర్‌రూరల్‌ జడ్పీటీసీ పురుమల్ల లలిత వేడుకల్లో పాల్గొన్నారు. యువతులు, చిన్నారులు సంప్రదాయ దుస్తులు, బతుకమ్మ పాటలు, చప్పట్ల మోతలతో సందడి చేశారు. బతుకమ్మలను రంగు రంగుల పూలతో పేర్చి మహిళలు, చిన్నారులు బతుకమ్మ ఆడారు. ఆట పాటలతో ఆలరించిన బతుకమ్మలను మహిళలు డప్పు చప్పుళ్లు బతుకమ్మ పాటలతో గ్రామ శివారులోని మానేరు వాగు, జక్కప్ప చెరువు, మల్లయ్య చెరువుతో పాటు, గుంటూరు పల్లెలోని నల్ల చెరువులో నిమజ్జనం చేశారు. తాము తయారు చేసిన సద్దుల ప్రసాదాలను మహిళలు వాయినాలు పంచుకుని ఆనందోత్సాహాల మధ్య పండుగను వైభవంగా నిర్వహించారు. బతుమ్మ పండుగలో కరోనా కట్టడి ఎక్కడా కనిపించలేదు. 

Updated Date - 2020-10-23T10:50:41+05:30 IST