తొలిసారిగా శ్రీశైలంలో జల్లు స్నానాలు

ABN , First Publish Date - 2022-03-01T01:54:40+05:30 IST

శ్రీశైలంలో పాతాళగంగ నీటి మట్టం లేక రాళ్ల గుట్టలతో దర్శనమిస్తోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీగిరికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు

తొలిసారిగా శ్రీశైలంలో జల్లు స్నానాలు


కర్నూలు: శ్రీశైలంలో పాతాళగంగ నీటి మట్టం లేక రాళ్ల గుట్టలతో దర్శనమిస్తోంది. శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీగిరికి వచ్చిన లక్షలాది మంది భక్తులకు నదీ స్నానం లేక అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా సమయంలోనూ నదీ స్నానాలు ఆచరించిన భక్తులు ప్రస్తుతం జల్లు స్నానాలతో సరిపుచ్చుకుంటున్నారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుదుత్పత్తి కోసం ఎడాపెడా తోడేయడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందని అటు భక్తులు, ఇటు స్థానికులు విమర్శిస్తున్నారు. 


215.80 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం, 885 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టం కలిగిన శ్రీశైలం జలాశయంలో ప్రస్తుతం 802.70 అడుగుల వద్ద 30.35 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. 2021 నీటి సంవత్సరంలో పైన వరదల కారణంగా శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరింది. వరదలు ముగియక ముందు నుంచి శ్రీశైలం కుడి, ఎడమ గట్టు నుంచి విద్యుదుత్పత్తి కోసం అత్యధికంగా నీటిని తోడేశారు. దీంతో ఆగస్టు నెలాఖరు నుంచే శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టడం ఆరంభమైంది. 2022 జనవరి చివరకే 835.60 అడుగుల వద్ద 55.87 టీఎంసీల నిల్వ ఉండగా, ఫిబ్రవరి నాటికి పరిస్థితి మరింత క్షీణించింది. 

Updated Date - 2022-03-01T01:54:40+05:30 IST