జీహెచ్‌ఎంసి పరిధిలో కొత్తగా మరో 33 బస్తీదవాఖానాలు

ABN , First Publish Date - 2020-07-05T21:50:13+05:30 IST

నగరంలో ఉన్నపేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు కొత్తగా మరో 33 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసి ద్వారా వసతి, ఇతర మౌలిక వసతులు కల్పించినట్టు జీహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు.

జీహెచ్‌ఎంసి పరిధిలో కొత్తగా మరో 33 బస్తీదవాఖానాలు

హైదరాబాద్‌: నగరంలో ఉన్నపేద మధ్యతరగతి ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేసేందుకు కొత్తగా మరో 33 బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసేందుకు జీహెచ్‌ఎంసి ద్వారా వసతి, ఇతర మౌలిక వసతులు కల్పించినట్టు జీహెచ్‌ఎంసి కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బందిని నియమించి ప్రాధమిక వైద్య సేవలను అందిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఆకాంక్షల మేరకు పేదలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉండే కాలనీలు, బస్తీలకు ప్రభుత్వం వైద్యాన్నిచేరువ చేసేందుకు బస్తీ దవాఖానాలను ఏర్పాటుచేస్తోంది. 


ఇందులో భాగంగానే 2019లో ఏర్పాటుచేసిన 123 బస్తీదవాఖానాలకు అదంగా 2020 మేనెల 22న మరో 44 బస్తీదవాఖానాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రపురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసి పరిధిలో ప్రతి వార్డుకు కనీసం రెండుచొప్పున బస్తీదవాఖానాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంలో భాగంగా మరో 33 బస్తీదవాఖానాలను ప్రారంభించేందుకు అనువుగా వసతులు కల్పించినట్టు కమిషనర్‌ తెలిపారు. దీంతో నగరంలో బస్తీదవాఖానాల సంఖ్య 200లకు చేరుతుందని తెలిపారు.

Updated Date - 2020-07-05T21:50:13+05:30 IST