Basara ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-06-20T00:13:21+05:30 IST

ప్రభుత్వం మెట్టు దిగడంలేదు.. డిమాండ్ల విషయంలో విద్యార్ధులూ తగ్గడం లేదు. బాసర అర్జీయూకేటి-ట్రిపుల్ ఐటీ (Triple IT)లో విద్యార్థుల

Basara ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల కీలక నిర్ణయం

నిర్మల్‌: ప్రభుత్వం మెట్టు దిగడంలేదు.. డిమాండ్ల విషయంలో విద్యార్ధులూ తగ్గడం లేదు. బాసర అర్జీయూకేటి-ట్రిపుల్ ఐటీ (Triple IT)లో విద్యార్థుల (Students) నిరసనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. ఆరు రోజులుగా విద్యార్థులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక విద్యార్థులు చేస్తున్న ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులోభాగంగా  ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 24 గంటలపాటు నిరసన దీక్షకు విద్యార్థులు పిలుపు నిచ్చారు. రాత్రంతా దీక్ష చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.


బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు తలపెట్టిన ఆందోళన ఇప్పట్లో చల్లారేలేలా కనిపించడం లేదు. విద్యార్థులు తమ ఆందోళనను రోజురోజుకు తీవ్రతరం చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనను ఆపేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలు సఫలం కావడం లేదు. అధికారులు, మంత్రులు ఇస్తున్న హామీలు విద్యార్థులను సంతృప్తి పరచడం లేదు. ప్రతీరోజు యూనివర్సిటీ అధికారులు విద్యార్థులతో చర్చిస్తూనే ఉన్నారు. మరోపక్క ఆందోళన ప్రారంభమైన మొదటిదశలోనే మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి సోషల్‌ మీడియా వేదికగా హామీలిచ్చారు. అయినా మంత్రులు హామీలను విద్యార్థులు ఖాతరు చేయకుండా ఆందోళనను ముందుకు నడిపించారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా విద్యార్థులతో చర్చలు జరిపారు. అయినా సమస్య కొలిక్కి రాలేదు.

Updated Date - 2022-06-20T00:13:21+05:30 IST