బేస్‌లైన్‌.. పరీక్ష

ABN , First Publish Date - 2021-07-28T05:42:33+05:30 IST

జిల్లాలో ప్రాథ మిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థు లకు సోమవారం నుంచి బేస్‌లైన్‌ పరీక్షలు ప్రారం భమయ్యాయి.

బేస్‌లైన్‌.. పరీక్ష

పాఠశాలల హెచ్‌ఎంలకు గుదిబండ

డీసీఈబీ నుంచి సరఫరా కాని ప్రశ్నాపత్రాలు

నెట్‌లో పెట్టి చేతులు దులుపుకున్న విద్యాశాఖ

పాఠశాలకు ప్రింటింగ్‌, జిరాక్స్‌లకు రూ.2 వేల ఖర్చు

విద్యార్థుల తల్లిదండ్రులపై భారం వేయనున్న ఉపాధ్యాయులు



కరోనా నేపథ్యంలో పాఠశాల స్థాయిలో నిర్వహిస్తోన్న బేస్‌లైన్‌ పరీక్ష.. అటు ప్రధానోపాధ్యాయులకు ఇటు విద్యార్థుల తల్లిదండ్రులకు గుదిబండగా మారింది. సాధారణంగా డీసీఈబీ(డిస్ర్టిక్‌ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు) నుంచి పాఠశాలలకు తరగతి, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలను సరఫరా చేయాలి. బేస్‌లైన్‌ ప్రశ్నాపత్రాలను నెట్‌లో పెట్టి డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సోమవారం సూచించింది. ప్రింటింగ్‌, స్టేషనరీ కోసం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో ఆ ఖర్చుల భారం తామెక్కడ మోయాలంటూ ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. చివరకు ఈ ఖర్చు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేయాలని కొందరు నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం మీద బేస్‌లైన్‌ పరీక్ష ప్రధానోపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు పరీక్షగా మారింది. 


గుంటూరు(విద్య), జూలై 27: జిల్లాలో ప్రాథ మిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థు లకు సోమవారం నుంచి బేస్‌లైన్‌ పరీక్షలు ప్రారం భమయ్యాయి. ఆయా పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలను తొలుత జిల్లా కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు నుంచి సరఫరా చేస్తామని పాఠశాల విద్యా శాఖ ప్రకటించింది. పరీక్షలు ప్రారంభమయ్యే వర కు మౌనంగా ఉండి పోయింది. సోమవారం నుం చి పరీక్షలు ప్రారంభించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో నెట్‌లో పరీక్షా పత్రాలు ఉన్నాయి వాటిని డౌన్‌లోడు చేసుకుని వాటిని తరగతుల వారీగా పంపిణీ చే యాలని విద్యాశాఖ అధికారులు పాఠశాలల ప్రధా నోపాధ్యాయులకు సూచించారు. దీంతో అప్ప టికప్పుడు వాటిని డౌన్‌లోడు చేసుకుని ప్రింట్లు తీసి జిరాక్స్‌లు చేసి విద్యార్థులకు అందజేసేందుకు ప్రధా నోపాధ్యాయులు నానాయాతన పడాల్సి వచ్చింది. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠ శాలలకు దాదాపు  550పైగా ఉన్నాయి. కొవిడ్‌ నేప థ్యంలో మూత పడిన తర్వాత విద్యార్థుల్ని పరీక్షలు లేకుండానే ఉన్నత తరగతులకు ప్రమోట్‌ చేశారు. అయితే విద్యార్థులకు కనీసం ఒక్క పరీక్ష అయినా పెట్టి వారిలో సామర్థ్యాలను పరీక్షించాలని విద్యాశా ఖ అధికారులు భావించారు. దీంతో సోమవారం (ఈ నెల 26) నుంచి విడతల వారీగా బేస్‌లైన్‌ పరీ క్షలు నిర్వహించాలని అధికారులు ప్రధానోపాధ్యా యులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే పరీక్షలు ప్రారంభానికి ముందు పశ్నాపత్రాలు రాలేదు. బేస్‌ లైన్‌ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు పా ఠశాల విద్యాశాఖ నెట్‌లో పెట్టి వాటిని వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టారు. వాటిని డౌన్‌లోడు చేసి విద్యార్థు లకు పరీక్షలు నిర్వహించాల్సిన దుస్థితి నెల కొందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇందు కోసంఒక్కొ పాఠశాలకు కనీసం సగటున రూ.1000 నుంచి రూ.2వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.


జిరాక్స్‌ బాధ్యతలు తల్లిదండ్రులకు..

జిల్లాలో కొన్ని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఒక సెట్‌ మాత్రం నెట్‌ నుంచి డౌన్‌లోడు చేసుకున్నారు. వాటిని విద్యార్థుల తల్లిదండ్రులకు ఇచ్చి రెండు కాపీ లు జిరాక్స్‌ తీయిం చుకోవాలని ఉచిత సలహాఇచ్చారు. ఒకసెట్‌ ఉన్న పశ్నలకు సమాధానాలు రాసి రెండో సెట్‌ పాఠశాలకు ఇవ్వాలని సూచించారు. దీంతో ఒక్కొ విద్యార్థికి జి రాక్స్‌ కోసం రూ.10 నుంచి రూ.25 ఖర్చు చేయాల్సి వచ్చిందని తల్లిదండ్రులు వాపోతున్నారు.


డీసీఈబీ నిధులేమయ్యాయి?

జిల్లాలో రెండేళ్లుగా విద్యార్థులకు ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేదు.  విద్యార్థుల అడ్మిషన్‌ సమయంలోనే డీసీఈబీకి పరీక్షల కోసం కొంత మొత్తం నగదు చెల్లిస్తారు. ఈ మొత్తం ప్రస్తుతం డీసీఈబీ వద్ద లక్షల్లోనే ఉండవచ్చు. దీనిని విద్యార్థుల కోసం వినియోగించాలి. అయితే పై నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో పరీక్షా పత్రాల పంపిణీపై అధికారులు ఎటువంటి నిర్ణ యం తీసుకోలేదు. ఫలితంగా విద్యార్థుల తల్లిదం డ్రులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు జేబుల్లోంచి సోమవారం నుంచి ప్రారంభమైన బేస్‌ లైన్‌ పరీక్షల ఖర్చు భరించాల్సి వచ్చింది. 


Updated Date - 2021-07-28T05:42:33+05:30 IST