వర్షాకాలంలోపు బేస్మెంట్లు పూర్తికావాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-05-29T08:39:46+05:30 IST

తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో లబ్ధిదారులకు చంద్రగిరి మండలం ఎం.కొత్తపల్లె వద్ద ఇచ్చిన జగనన్న లేఅవుట్‌లో గృహాల బేస్మెంట్లు వర్షాకాలంలోపు పూర్తి కావాలని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆదేశించారు.

వర్షాకాలంలోపు బేస్మెంట్లు పూర్తికావాలి: కలెక్టర్‌
ఎం.కొత్తపల్లె వద్ద లేఅవుట్‌ను పరిశీలిస్తున్న వెంకటరమణారెడ్డి

చంద్రగిరి, మే 28: తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో లబ్ధిదారులకు చంద్రగిరి మండలం ఎం.కొత్తపల్లె వద్ద ఇచ్చిన జగనన్న లేఅవుట్‌లో గృహాల బేస్మెంట్లు వర్షాకాలంలోపు పూర్తి కావాలని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి ఆదేశించారు. లేఅవుట్‌ను శనివారం ఆయన పరిశీలించారు. అంతకుముందు నగరపాలక సంస్థ కార్యాలయంలో జగనన్న లేఅవుట్లలో గృహ నిర్మాణాలపై ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ హరికృష్ణ, అధికారులతో సమీక్షించారు. తిరుపతి తప్ప అన్ని మున్సిపాలిటీల్లో నిర్మాణాల పురోగతి బాగుందన్నారు. కాంట్రాక్టర్లను ఎక్కువమందిని గుర్తించి పనులు ప్రారంభించాలన్నారు. కేటగిరీ-3 లబ్ధిదారుల ఎంవోయూలు త్వరగా పూర్తి చేయాలన్నారు. రోజువారీ టార్గెట్‌ ఇచ్చిన స్పెషల్‌ ఆఫీసర్లు నిరంతరం పురోగతిపై దృష్టి సారించాలని చెప్పారు.ఎం.కొత్తపల్లె వద్ద తొలి ద శలో 5,117గృహాలు మంజూరైతే ఇంకా చాలా నిర్మాణాలు చేపట్టలేదన్నారు. ముంగిలిపట్టు రైల్వేస్టేషన్‌కు పక్కనే ఉన్న ఈ లేఅవుట్‌లో మంచి వాతావరణం ఉందన్నారు. ఆర్డీవో కనకనరసారెడ్డి, హౌసింగ్‌ ఓఎస్డీ రామచంద్రారెడ్డి, పీడీ శర్మ, ఈఈ మోహన్‌, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్‌ చంద్రమౌళీశ్వరరెడ్డి, తహసీల్దార్లు వెంకటరమణ, శిరీష, ఎంపీడీవో రమే్‌షబాబు, చంద్రగిరి ఎంపీపీ హేమేంద్రకుమార్‌రెడ్డి, ముంగిలిపట్టు సర్పంచ్‌ భారతిదామోదరనాయుడు,తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-29T08:39:46+05:30 IST