నా విజయం ఖాయం

ABN , First Publish Date - 2022-06-14T15:59:53+05:30 IST

విధాన పరిషత్‌ ఎన్నికల బరిలో ఓటమి ఎరుగని వీరుడిగా ఖ్యాతి గడించిన బసవరాజ హొరట్టి తన గెలుపు ఖాయమని ప్రకటించారు. హుబ్బళ్లిలో

నా విజయం ఖాయం

- బసవరాజ హొరట్టి 

- ఎనిమిదోసారి గెలుపుపై ధీమా


బెంగళూరు, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): విధాన పరిషత్‌ ఎన్నికల బరిలో ఓటమి ఎరుగని వీరుడిగా ఖ్యాతి గడించిన బసవరాజ హొరట్టి తన గెలుపు ఖాయమని ప్రకటించారు. హుబ్బళ్లిలో సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పశ్చిమ ఉపాధ్యాయ నియోజకవర్గంలో తనకు 70 శాతం ఓట్లు ఖాయమన్నారు. అన్నివర్గాల ప్రజలు తనకు మద్దతు ఇచ్చారని తెలిపారు. విధానపరిషత్‌కు వరుసగా 7 సార్లు అంటే 42 సంవత్సరాలపాటు ఎన్నికై దేశ పార్లమెంటరీ వ్యవస్థలోనే సరికొత్త రికార్డు సృష్టించిన హొరట్టి 8వ విజయం తన సొంతమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాకపోతే గతంలో ఏడుసార్లు ఆయన జేడీఎస్‌ తరపున ప్రాతినిధ్యం వహించగా ఈసారి మాత్రం బీజేపీ టికెట్‌పై బరిలో దిగడం గమనార్హం. 

Updated Date - 2022-06-14T15:59:53+05:30 IST