Basara IIIT: ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి: వీసీ

ABN , First Publish Date - 2022-07-31T19:50:27+05:30 IST

బాసర ట్రిపుల్‌ ఐటీ (Basara Triple IT) విద్యార్థుల (Students) సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని వీసీ వెంకటరమణ ప్రకటించారు.

Basara IIIT: ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి: వీసీ

నిర్మల్: బాసర ట్రిపుల్‌ ఐటీ (Basara Triple IT) విద్యార్థుల (Students) సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని వీసీ వెంకటరమణ ప్రకటించారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవేనని తెలిపారు. కొన్ని పరిష్కరించామని, మరికొన్ని ప్రోగ్రెస్‌లో ఉన్నాయని చెప్పారు. భోజనం మానేసి విద్యార్థులు ఆందోళన చేయడం సరికాదన్నారు. కొత్త మెస్ కాంట్రాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశామని పేర్కొన్నారు. వారం రోజుల్లోగా ప్రక్రియ పూర్తవుతుందని వెంకటరమణ తెలిపారు. 


మరోవైపు ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనకు పేరెంట్స్ కమిటీ మద్దతు ప్రకటించింది. భోజనం మానేసి విద్యార్థులు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడంపై పేరెంట్స్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. క్యాంపస్ మెస్‌లో ఈ1, ఈ2 విద్యార్థుల నిరసన కొనసాగుతోంది. క్యాంపస్ మెస్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

Updated Date - 2022-07-31T19:50:27+05:30 IST