Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆలయం వద్ద పూజల కోసం లారీల బారులు

ఆందోల్‌ మైసమ్మ ఆలయం వద్ద రెండు కిలోమీటర్ల బారులు తీరిన వైనం

చౌటుప్పల్‌ రూరల్‌/ చౌటుప్పల్‌, అక్టోబరు 14: విజయదశమి పర్వ దినం నేపథ్యంలో వాహన పూజలకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం దండు మల్కాపురం శివారులోని శ్రీఆందోల్‌ మైసమ్మ దేవాలయం వద్ద వాహనాలు బారులు తీరాయి. పట్టణంలో కూడా  రాత్రి వాహనాల రద్దీ కొనసాగింది. ఆలయంలో వాహనాల పూజలు నిర్వహిస్తుండటంతో విజ యవాడ- హైదరాబాద్‌ జాతీయ రహదారిపై దండు మల్కాపురం దేవాల యం నుంచి తూప్రాన్‌పేట వరకు రెండు కిలోమీర్ల దూరం వరకు లారీలు బారులు తీరాయి. వెయ్యికి పైగా లారీలకు పూజలు చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడడంతో ఇండస్ట్రియల్‌ పార్క్‌ రోడ్డులో లారీలను పార్కింగ్‌ చేయించారు. వాహన పూజల కోసం ప్రత్యేకంగా 20మంది పురోహితులను రప్పించారు. ట్రాఫిక్‌ నియంత్రణ కోసం 30మంది పోలీసులను నియమిం చారు. గురువారం రాత్రి చౌటుప్పల్‌ పట్టణంలో కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. హైవే వెంట హోటళ్లు, దాబాలు సైతం కిటకిటలాడాయి. చౌటుప్పల్‌లో పలుమార్లు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. 

Advertisement
Advertisement