ప్రహరీలు లేనిచోట బారికేడ్లు

ABN , First Publish Date - 2021-03-03T04:33:32+05:30 IST

పల్‌ ఎన్నికలకు సంబంధించి కేంద్రాల వద్ద ప్రహరీలు లేకపోతే ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్‌ దండే అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయనగరంలోని రాజీవ్‌ క్రీడా మైదానంలో ఏ

ప్రహరీలు లేనిచోట బారికేడ్లు
సమావేశంలో మాట్లాడుతున్న ఎన్నికల పరిశీలకుడు కాంతిలాల్‌ దండే




ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్‌ దండే

రింగురోడ్డు, మార్చి 2: మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి కేంద్రాల వద్ద ప్రహరీలు లేకపోతే ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్‌ దండే అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయనగరంలోని రాజీవ్‌ క్రీడా మైదానంలో ఏర్పాటు చేయనున్న కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూమ్‌, ఓట్ల లెక్కింపు హాల్‌ను సందర్శించారు. వాహనాల పార్కింగ్‌, ఎన్నికల సామగ్రి పంపిణీ తదితర ఏర్పాట్లు పరిశీలించారు.  అధికారులు, సిబ్బందికి సలహాలు, సూచనలు అందించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. ఫిర్యాదులు స్వీకరించేందుకు హెల్ప్‌లైన్‌ డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అనంతరం స్థానిక మునిసిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని సందర్శించారు. క్లష్టర్ల వారీగా ఉన్న రిటర్నింగ్‌ అధికారులకు బాధ్యతలు అప్పగించాలని సూచించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల పరిస్థితిపై డీఎస్పీ అనీల్‌కుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ మాట్లాడుతూ జిల్లాలో మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి 396 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జేసీ మహేష్‌కుమార్‌, కమిషనర్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-03-03T04:33:32+05:30 IST