Sep 24 2021 @ 00:30AM

బరిలో బంగారం పుంజు

రాజ్‌ తరుణ్‌ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘అనుభవించు రాజా’. త్వరలోనే థియేటర్లలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను గురువారం రామ్‌చరణ్‌ విడుదల చేశారు. ‘టీజర్‌ చాలా ఎంటర్టైనింగ్‌గా ఉంది. చాలా ఎంజాయ్‌ చేశాను’ అని రామ్‌ చరణ్‌ చెప్పారు. ‘బంగారం గాడి పుంజు బరిలో ఉండగా వేరేవాడు గెలవడం కష్టం’ అంటూ రాజ్‌ తరుణ్‌ చెప్పిన డైలాగ్‌ ఆకట్టుకుంది. ఖాశిష్‌ ఖాన్‌ కథానాయిక నటిస్తున్నారు. ఆడుకాలమ్‌ నరేన్‌, అజయ్‌, సుదర్శన్‌, అరియానా కీలకపాత్రలు పోషిస్తున్నారు. గోపీ సుందర్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి భాస్కరభట్ల గీత రచయిత.  సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్నారు.