Abn logo
Sep 21 2020 @ 07:29AM

బరేలీ నగరంలో వస్త్ర పరిశ్రమ..యూపీ సీఎం వెల్లడి

Kaakateeya

బరేలీ (ఉత్తరప్రదేశ్): బరేలీ నగరంలో కొత్తగా టెక్స్ టైల్ పార్కు నిర్మించనున్నట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. నేత కార్మికులకు నిలయమైన బరేలీలో త్వరలో వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేస్తామని సీఎం యోగి అధికారులతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. బరేలీ, ఫిలిబిత్, షాజహాన్ పూర్, బడౌన్ ప్రాంతాల్లో రూ.50కోట్లతో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టుల పనుల గురించి సీఎం వీడియో కాన్ఫరెన్సులో సమీక్షించారు. 

మరో రూ.50కోట్లతో 8 రోడ్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని సీఎం చెప్పారు. బరేలీ స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులు త్వరగా చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. అమృత్ పథకం కింద సేఫ్ సిటీలో ఇంటింటికి మంచినీటిని సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు.

Advertisement
Advertisement