సెలూన్ తెరిచినంత‌నే.... అవాక్క‌యిన హెయిర్ స్టయిలిస్ట్‌

ABN , First Publish Date - 2020-05-20T11:24:49+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి భారతదేశంతో సహా ప్రపంచంలోని చాలా దేశాలలో లాక్‌డౌన్ అమ‌లవుతోంది. ఈ సమయంలో...

సెలూన్ తెరిచినంత‌నే.... అవాక్క‌యిన హెయిర్ స్టయిలిస్ట్‌

న్యూయార్క్‌: కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడానికి భారతదేశంతో సహా ప్రపంచంలోని చాలా దేశాలలో లాక్‌డౌన్ అమ‌లవుతోంది. ఈ సమయంలో అన్ని వ్యాపారాలు మూత‌ప‌డ్డాయి. ఫ‌లితంగా ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పుడు ప్రతి దేశంలోనూ లాక్‌డౌన్‌లో కొంతమేర‌కు సడలింపులు ఇచ్చారు. ఈ కారణంగా సెలూన్లు తెరుచుకున్నాయి. అమెరికాలో ఒక సెలూన్ తెరుచుకున్న వెంటనే దాని య‌జ‌మాని కొన్ని గంటల్లో లక్షాధికారి అయ్యింది. వివ‌రాల్లోకి వెళితే అమెరికాలోని కొలరాడోలో లాక్‌డౌన్ ముగిశాక‌ సెలూన్లు తెరుచుకున్నాయి. అటువంటి పరిస్థితిలో హెయిర్ స్ట‌యిలిస్ట్‌ ఇలిసియా నోవోట్నీ తన దుకాణానికి వ‌చ్చే వినియోగదారుల ఎదురుచూస్తోంది. ఇంత‌లో ఒక కస్టమర్ ఆమె సెలూన్‌కి వచ్చి హెయిర్‌క‌ట్ చేయించుకున్నాడు. త‌రువాత ఆమెకు రెండున్నర వేల డాలర్లు ఇచ్చి వెళ్లిపోయాడు. కాగా నోవోట్నీ చాలా రోజులుగా ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతోంది. సెలూన్ ప్రారంభించిన వెంట‌నే ఇంత‌ పెద్ద మొత్తంలో సొమ్ము ల‌భించ‌డంతో ఆమె ఆనందం వ్య‌క్తం చేస్తోంది.  ఇంతేకాకుండా ఆమె ద‌గ్గ‌ర క‌టింగ్ చేయించుకున్న వ్య‌క్తి ఆమె మేనేజర్‌కు వెయ్యి డాలర్లు, రిసెప్షనిస్ట్‌కు 500 డాల‌ర్లు ఇచ్చాడు. ఈ సంద‌ర్భంగా ఆ మహిళా హెయిర్‌స్టైలిస్ట్ అత‌నికి కృతజ్ఞతలు చెబుతూ, త‌మ‌కు ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఈ డబ్బు చాలా అవ‌స‌ర‌మ‌ని తెలిపింది. 

Updated Date - 2020-05-20T11:24:49+05:30 IST