Abn logo
Aug 2 2021 @ 03:17AM

హామీలు తక్షణమే అమలు చేయాలి

న్యాయవాదుల సంఘం డిమాండ్‌


రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 1: న్యాయవాదులకిచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. సంఘ రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం వెబినార్‌ ద్వారా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. న్యాయవాదులకు ఇస్తానన్న రూ.100 కోట్లు, మిగిలిన రూ.75 కోట్లు తక్షణమే విడుదల చేయాలని, కొవిడ్‌ కాలంలో ఇబ్బందులు పడ్డ న్యాయవాదులను ఆదుకోవాలని కోరారు. వైఎస్సార్‌ లా నేస్తం, న్యాయవాదుల మరణానంతరం ప్రభుత్వం ఇస్తానన్న మ్యాచింగ్‌ గ్రాంట్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. దేశద్రోహ నేరం సెక్షన్‌ 124ఏ ఐపీసీని తక్షణమే తొలగించాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచనను, రైతు వ్యతిరేక నల్ల చట్టాలను ఉపసంహరించుకోవాలని, రాష్ట్రంలోని అన్ని న్యాయస్థానాల్లో తెలుగులోనే వాదప్రతివాదనలు జరగాలనే తదితర తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు. సంఘం ప్రధాన కార్యదర్శి చలసాని అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

క్రైమ్ మరిన్ని...