Advertisement
Advertisement
Abn logo
Advertisement

డిప్లోమో ఫలితాల్లో బాపట్ల విద్యార్థినికి ఫస్ట్‌ర్యాంక్‌

బాపట్ల: బాపట్ల పాలిటెక్నిక్‌ కళాశాలలో ద్వితీయ సంవత్స రం డిప్లోమో చదువుతున్న పర్వతనేని నిహారిక సెమిస్టర్‌ ఫలితాల్లో రాష్ట్రస్థాయి ప్రథమర్యాంక్‌ సాధించింది. 900 మార్కులకు గాను 899 మార్కులు పొందింది. దీంతో మంగళవారం బాపట్ల ఎడ్యుకేషన్‌ సొసైటీ కార్యదర్శి మానం నాగేశ్వరరావు పాలకమండలి సభ్యు లు, బోధన, బోధనేతర సిబ్బందితో కలిసి విద్యార్థినిని అభినందించారు. 10వేల రూపాయల ప్రోత్సాహక బహుమతిని అందజేశారు. షేక్‌ రషీద్‌ 97శాతం మార్కులతో నాలుగో ర్యాంక్‌ సాధించటం అభినందనీయమన్నారు. 


Advertisement
Advertisement