Advertisement
Advertisement
Abn logo
Advertisement

భయపెట్టి పరీక్షలు రాయించటం దారుణం : ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

బాపట్ల: బాపట్ల ఇంజనీరింగ్‌ కళాశాలలో (అటానమస్‌) చదువుకునే విద్యార్థులను భయపెట్టి పరీక్షలు రాయించటం దారుణమని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.మనోజ్‌కుమార్‌ అన్నారు. సోమవారం ఇంజనీరింగ్‌ కళాశాలలో చదివే విద్యార్థులకు నిర్వహించే పరీక్షలను కొంతకాలం వాయిదా వేయాలని ఎస్‌ఎఫ్‌ఐ, ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నప్పటికి గ్రామీణ ప్రాంతంలో ఉండే విద్యార్థులకు ఇంటర్నెట్‌ సదుపాయం లేక తరగతులకు హాజరు కాలేకపోయారన్నారు. కొద్ది రోజులుపాటు పరీక్షలను వాయిదావేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కిరణ్‌, విద్యార్థులు పాల్గొన్నారు. Advertisement
Advertisement