మహాత్ముడి మార్గంలో పయనించాలి

ABN , First Publish Date - 2022-10-03T06:32:59+05:30 IST

అహింస విధానంలో స్వాతంత్య్రం తెచ్చి పెట్టిన మహాత్మాగాంధీ మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ కోరారు.

మహాత్ముడి మార్గంలో పయనించాలి
జీబీసీరోడ్డులో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటిస్తున్న కలెక్టర్‌, జేసీ తదితరులు

ప్రపంచ దేశాలను కదిలించిన మహనీయుడు

జయంతి కార్యక్రమంలో కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ 

బాపట్ల, అక్టోబరు 2: అహింస విధానంలో స్వాతంత్య్రం తెచ్చి పెట్టిన మహాత్మాగాంధీ మార్గంలో ప్రతి ఒక్కరు పయనించాలని కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌ కోరారు. గాంధీ జయంతి సందర్భంగా జీబీసీరోడ్డులోని విగ్రహానికి జేసీ డాక్టర్‌ కె.శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనర్‌ ఎ.భానుప్రతాప్‌ తదితరులతో కలిసి కలెక్టర్‌ పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశస్వాతంత్య్ర కోసం శాంతియుత మార్గంలో గాంధీజీ నడిచి ప్రపంచ దేశాలను కదిలించిన గొప్పమహనీయుడని చెప్పారు. హింస లేకుండా దేశవ్యాప్తంగా ఉద్యమాలు నడిపిన ఉద్యమకారులని కొనియాడారు. బాపట్ల ప్రాంతానికి గాంధీజీ మూడు పర్యాయాలు వచ్చారని గుర్తు చేశారు. ఆయన భావజాలం ప్రతిఒక్కరిలో రావాలన్నారు. ఆయన నేర్పిన అహింసామార్గంలో నడుస్తామంటూ ప్రజలంతా ప్రతిజ్ఞ చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ డీఈ కె.శ్రీనివాసులు, శానిటరి ఇన్‌స్పెక్టర్‌ కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

పెన్సిల్‌పై మహాత్మాగాంధీ జీవిత చరిత్ర 

జిల్లాలోని కారంచేడు మండలం స్వర్ణగ్రామానికి చెందిన అన్నం మహిత మహాత్మాగాంధీ జీవిత చరిత్రను పెన్సిల్‌ మీద రాసి ఆ కళారూపాన్ని ఆదివారం కలెక్టర్‌ కె.విజయకృష్ణన్‌కు అందజేశారు. గాంధీజీ చరిత్రను చూసిన కలెక్టర్‌ ఆ మహిళను అభినందించారు. ఇప్పటికే పెన్సిల్‌ మీద పలువురు పేర్లు, చిత్రపటాలు, వారి జీవిత చరిత్రలు చెక్కుతూ సూక్ష్మకళాకారునిగా ప్రాచుర్యం పొందారన్నారు.  


Updated Date - 2022-10-03T06:32:59+05:30 IST