ఆన్‌లైన్ ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన నిషిద్ధ సిక్కు సంఘం

ABN , First Publish Date - 2020-07-05T01:50:15+05:30 IST

పంజాబ్‌లో రిఫరెండం నిర్వహించడం లక్ష్యంగా సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే)

ఆన్‌లైన్ ఓటర్ రిజిస్ట్రేషన్ ప్రారంభించిన నిషిద్ధ సిక్కు సంఘం

న్యూఢిల్లీ : పంజాబ్‌లో రిఫరెండం నిర్వహించడం లక్ష్యంగా సిక్స్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) ఓటర్ల రిజస్ట్రేషన్‌ను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించింది. రష్యన్ పోర్టల్ ద్వారా రిఫరెండం, 2020 పేరుతో ఈ కార్యక్రమాన్ని ఈ సంస్థ నిర్వహిస్తోంది. 


సిక్కుల కోసం ప్రత్యేక ఖలిస్థాన్ కావాలంటూ ‘రిఫరెండం, 2020 పేరుతో ఆన్‌లైన్ ఉద్యమం చేపట్టిన ఎస్ఎఫ్‌జేపై గత ఏడాది జూలైలో భారత దేశ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. 


ప్రభుత్వేతర స్వాతంత్ర్య రిఫరెండంలో పాల్గొనేందుకు 18 ఏళ్ళ వయసు పైబడినవారు నమోదు చేసుకోవాలని ఎస్ఎఫ్‌జే కోరింది. పంజాబ్‌లో, భారత దేశంలో నివసించే సిక్కులు, ఇతరులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చునని తెలిపింది. 


ఈ ఓటర్ల రిజిస్ట్రేషన్లు పంజాబ్‌లోని ప్రతి ఇంటి నుంచి జరిగే విధంగా ఎస్ఎఫ్‌జే క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఖలిస్థాన్ అనుకూలవాదులపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధిస్తున్నప్పటికీ, ఇటువంటి చర్యలు కొనసాగుతుండటం గమనార్హం.


Updated Date - 2020-07-05T01:50:15+05:30 IST