బ్యాంకు సెలవుల దరువుకు రెడీ కండి! ఆ వారంలో ఏకంగా ఆరు రోజులు..

ABN , First Publish Date - 2020-02-22T01:01:11+05:30 IST

అయితే వచ్చే నెలలో కూడా వినియోగదారులపై సెలవుల దరువు పడనుంది.

బ్యాంకు సెలవుల దరువుకు రెడీ కండి! ఆ వారంలో ఏకంగా ఆరు రోజులు..

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ చెల్లింపులు ఎంతగా ప్రాచుర్యం పొందినప్పటికీ బ్యాంకులకు సెలవులు వస్తే ఎంతో కొంత ఇబ్బంది తప్పదు. ముఖ్యంగా చెక్కుల క్లియరెన్స్ విషయంలో ఎదురయ్యే ఇబ్బందులు అంతా ఇంతా కాదు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం, రేపు నాలుగవ శనివారం, ఎల్లుండి ఆదివారం కావడంతో బ్యాంకులు మూతపడ్డాయి. 


అయితే వచ్చే నెలలో కూడా వినియోగదారులపై సెలవుల దరువు పడనుంది. మార్చి 11 నుంచి 13 వరకూ బ్యాంకులు స్ట్రైక్ పాటించనుండటంతో ఆ మూడు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. మార్చి 8న ఆదివారం, 10న హోలీ, 14న రెండో శనివారం, 15న ఆదివారం రావడంతో మరో నాలుగు సెలవలు రానున్నాయి. మొత్తంగా చూస్తూ మార్చి నెల రెండో వారంలో బ్యాంకులు కేవలం ఒకే రోజు అంటే మర్చి 9న మాత్రమే పనిచేయనున్నాయన్న మాట. దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తోంది. 



Updated Date - 2020-02-22T01:01:11+05:30 IST