వేలంలో భూములు దక్కించుకుంటున్నారా?.. ఇవి తెలుసుకోకపోతే అంతే సంగతులు..!

ABN , First Publish Date - 2022-07-28T23:23:58+05:30 IST

చాలా సందర్భాల్లో బ్యాంకు(Bank)లు నుంచి లోను (Loan) తీసుకున్న వ్యక్తులు వాటిని కట్టడంలో విఫలమవుతూ..

వేలంలో భూములు దక్కించుకుంటున్నారా?.. ఇవి తెలుసుకోకపోతే అంతే సంగతులు..!

హైదరాబాద్ (Hyderabad): చాలా సందర్భాల్లో బ్యాంకు(Bank)లు నుంచి లోను (Loan) తీసుకున్న వ్యక్తులు వాటిని కట్టడంలో విఫలమవుతూ ఉంటారు. లోన్లు తీసుకునేటప్పుడు షూరిటీ (Surety)గా ఆస్తుల పత్రాలతో పాటు ఇతరత్రా డాక్యుమెంట్స్ తనఖా పెడుతూ ఉంటారు. ఒకవేళ తిరిగి చెల్లించనట్లైతే వాటిని బ్యాంకులు వేలం వేస్తూ ఉంటాయి.  


అయితే వేలం(Auction)లో వాటిని కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ (High Court Senior Advocate Rapolu Bhaskar ) తెలిపారు. ముఖ్యంగా భూములకు సంబంధించిన వేలాల్లో సర్వే నెంబర్లు చెక్ చేసుకుని, వాటిపై ఆరా తీసి.. భూమి ఎవరిదనే తెలుసుకుని వేలంలో పాల్గొనాలని సూచించారు. గతంలో ఓ వ్యక్తి ఒక సర్వేలోని భూమిని చూపించి... మరో భూమిపై లోను తీసుకుని డబ్బులు కట్టలేదని..  అయితే వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తి మోసపోయారని తెలిపారు. బ్యాంకు అధికారులను నమ్మి వేలం పాటలో కొని మోసపోయినట్లు చెప్పారు. బ్యాంకులు, ప్రైవేటు వాళ్లు కలిసి చేసిన పొరపాట్లకు కొనుగోలు చేసిన వ్యక్తి.. లీగల్ (Legal)‎గా ఫైట్ చేయాల్సి వచ్చిందని హైకోర్టు సీనియర్ న్యాయవాది రాపోలు భాస్కర్ తెలిపారు. 

Updated Date - 2022-07-28T23:23:58+05:30 IST