కోస్టల్‌ ఆయిల్‌పై ‘దివాలా’ ప్రక్రియ

ABN , First Publish Date - 2020-09-25T06:15:16+05:30 IST

విశాఖపట్నం కేంద్రంగా పని చేసే కోస్టల్‌ ఆయిల్‌ గ్యాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దివాలా ప్రక్రియకు ఎన్‌సీఎల్‌ఏటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది...

కోస్టల్‌ ఆయిల్‌పై ‘దివాలా’ ప్రక్రియ

న్యూఢిల్లీ: విశాఖపట్నం కేంద్రంగా పని చేసే కోస్టల్‌ ఆయిల్‌ గ్యాస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై దివాలా ప్రక్రియకు ఎన్‌సీఎల్‌ఏటీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ కంపెనీపై దివాలా పిటిషన్‌ చెల్లదని హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ గత ఏడాది అక్టోబరు 30న ఇచ్చిన ఉత్తర్వులను తోసిపుచ్చింది. వెంటనే ఈ కేసుపై విచారణ చేపట్టి నెల రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. దివాలా పిటిషన్‌ దాఖలు చేయడంలో రుణ దాతలు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండి యా మూడేళ్లకు మించి ఆలస్యం చేశాయనే హైదరాబాద్‌ ఎన్‌సీఎల్‌టీ బెంచ్‌ వాదనను ఎల్‌సీఎల్‌ఏటీ తోసిపుచ్చింది. ఇక్కడ తొలి రుణ బకాయిల చెల్లింపు వైఫల్య తేదీని కాకుం డా రుణ పునర్‌ వ్యవస్థీకరణ ఒప్పందం తర్వాత జరిగిన రు ణ చెల్లింపుల తేదీని ప్రామాణికంగా తీసుకోవాలని కోరింది.

Updated Date - 2020-09-25T06:15:16+05:30 IST