జగనన్నకు తోడు రాని బ్యాంకర్లు

ABN , First Publish Date - 2020-10-20T06:25:52+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘జగనన్న తోడు పథకానికి పురిటి కష్టాలు తప్ప డం లేదు. చిరు వ్యాపారులు,

జగనన్నకు తోడు రాని బ్యాంకర్లు

ఏలూరు, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి):రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘జగనన్న తోడు పథకానికి పురిటి కష్టాలు తప్ప డం లేదు. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారస్తులు, వృత్తిదా రులకు సున్నా వడ్డీకి రూ.10 వేలు అందించే ఈ పథకం అమలు తీరు ఆదిలోనే హంసపాదులా తయారైంది. ఎక్కడా లేని విధంగా మన జిల్లాలోనే భారీ సంఖ్యలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. అన్ని జిల్లాల్లో సగటున 30 నుంచి 40 వేల వస్తే.. ఇక్కడ 86 వేలకుపైగా వచ్చాయి. వీటిలో 76 వేల దరఖాస్తులను ఆయా బ్యాంకులకు అధికారులు అందిం చారు. వీటిలో ఇప్పటి వరకూ ఆరు వేలు మాత్రమే ఓకే చేశారు.


36 వేల దరఖాస్తులు మాత్రమే తమకు చేరినట్లు బ్యాంకు అధికారులు గుర్తింపు ఇచ్చారు. మిగిలిన వాటికి ఆ గుర్తింపు కూడా లేదు. మిగిలిన జిల్లాలో 70 శాతం రుణాలు మంజూరయ్యాయి. రకరకాల నిబంధనలతో దరఖాస్తుదారు లను బ్యాంకు అధికారులు బెంబేలెత్తించారు. దీంతో జేసీ హి మాన్షుశుక్లా జోక్యం చేసుకుని బ్యాంకర్లతో చర్చలు జరిపారు.

ఆధార్‌ కార్డు, దరఖాస్తు, పెట్టబోయే యూనిట్‌ ఫొటో ఉంటే సరిపోతుందన్న ఒప్పందానికి బ్యాంకు అధికారులు వచ్చారు. లబ్ధ్దిదారులకు ఇచ్చే రుణం తిరిగి వస్తుందన్న నమ్మకం లేకపోవడం, ఇచ్చే మొత్తం చిన్నది కావడంతో తిరిగి వసూళ్ల కోసం చేపట్టే చర్యలకు తగు అవకాశం లేకపోవడం వంటి సమస్యల కారణంగా బ్యాంకర్లు వెనుకడుగు వేస్తున్నట్టు సమాచారం.



Updated Date - 2020-10-20T06:25:52+05:30 IST