CM's suggestion: మత్స్యకారులకు ఇక కిసాన్‌ క్రెడిట్‌కార్డులు

ABN , First Publish Date - 2022-08-25T17:13:23+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) కిసాన్‌ క్రెడిట్‌ కార్డు సదుపాయాన్ని విస్తరించిన నేపథ్యంలో తొలిదశలో రాష్ట్రంలో

CM's suggestion: మత్స్యకారులకు ఇక కిసాన్‌ క్రెడిట్‌కార్డులు

                                    - బ్యాంకర్లకు సీఎం సూచన 


బెంగళూరు, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) కిసాన్‌ క్రెడిట్‌ కార్డు సదుపాయాన్ని విస్తరించిన నేపథ్యంలో తొలిదశలో రాష్ట్రంలో మత్స్యకారులకు ఈ కార్డులను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై బ్యాంకర్లకు సూచించారు. అధికార నివాసం కృష్ణలో బు ధవారం రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తొలిదశలో దక్షిణకన్నడ, ఉడుపి, ఉత్తరకన్నడ(Dakshina Kannada, Udupi, Uttara Kannada) జిల్లాల మత్స్యకారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డులను జారీ చేయాలని కోరారు. మత్స్యశాఖ తన వద్ద ఉన్న మత్స్యకారుల సమగ్ర సమాచారాన్ని బ్యాంకులకు సమకూరిస్తే త్వరితగతిన కార్డుల పంపిణీ సాధ్యం కాగలదన్నారు. మత్స్యకారుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రభుత్వం చేపట్టిన పథకాలకు తోడు కిసాన్‌ క్రెడిట్‌కార్డు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. మత్స్యకారులకు పడవల కొనుగోళ్లకు బ్యాంకులు విరివిగా మంజూరు చేయాలని సీఎం సూచించారు. అంతకుముందు మత్స్యశాఖ మంత్రి ఎస్‌ అంగార(Fisheries Minister S Angara), రాష్ట్రప్రభుత్వ ముఖ్యకార్యదర్శి వందితాశర్మ మత్స్యకారుల ఆర్థిక పరిస్థితిని, వారి సమస్యలను బ్యాంకులు చేపట్టాల్సిన రుణసదుపాయాలను వివరించారు. బ్యాంకర్ల కమిటీ కన్వీనర్‌ మురళీకృష్ణ, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి ఎన్‌ మంజునాథ ప్రసాద్‌, మత్స్యశాఖ కార్యదర్శి సల్మాఫాహిమ్‌ సమావేశంలో పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-25T17:13:23+05:30 IST