ఫండ్ రైజింగ్ కు సన్నద్ధమైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర...

ABN , First Publish Date - 2021-06-13T22:53:50+05:30 IST

వచ్చే నెలాఖరు లోపు రూ. 2 వేల కోట్ల నిదులను క్యూఐపీ ప్రాతిపదికన సమీకరించుకునేందుకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎం) సన్నద్ధమైంది.

ఫండ్ రైజింగ్ కు సన్నద్ధమైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర...

పూనే : వచ్చే నెలాఖరు లోపు రూ. 2 వేల కోట్ల నిదులను క్యూఐపీ ప్రాతిపదికన సమీకరించుకునేందుకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీఓఎం) సన్నద్ధమైంది. సంస్థ సీఈఓ & ఎండి ఏఎస్ రాజీవ్ ఈ మేరకు ఓ ప్రకటన చేసారు. క్వాలిఫైడ్ ఇన్సిట్యూషనల్ ప్లేస్‌మెంట్ పద్దతిలో ఈ నిధుల సమీకరణ ఉండనుంది.


ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రూ. 5 వేల కోట్ల మొత్తానికి సరిపోను  ధనాన్ని క్యూఐపీ, రైట్స్ ఇష్యూ, ప్రిఫరెన్షియల్ ఇష్యూ పద్దతుల్లో సమీకరించుకునేందుకు బోర్డ్ అనుమతినిచ్చింది. అందులో భాగంగానే మొదటి దశలో మహారాష్ట్ర బ్యాంక్ యాజమాన్యం రూ. 2 వేల కోట్లను... క్యూఐపీ ద్వారా జులై నెల పూర్తయ్యేలోపునే సేకరించబోతోంది.


క్యూఐపీ ఇష్యూ రూ. వెయ్యి కోట్లు కాగా, గ్రీన్‌షూ ఆప్షన్ కింద రూ. వెయ్యి కోట్లు సేకరించబోతోంది. ఈ క్రమంలో... ప్రభుత్వ వాటా 94 శాతం నుంచి 85 శాతానికి తగ్గనుంది. అలానే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గరున్న కేపిటల్ నిల్వ నిష్పత్తి కూడా 14.49 శాతం నుంచి 17-18 శాతానికి పెరగనుంది. ఇక... సమీకరించనున్న ధనంతో పాటు ఇప్పటికే కార్పొరేట్ లోన్ వేల్యూ రూ. 40 వేల కోట్లు ఉండగా, దానిని మరో రూ. 10 వేల కోట్లకు పెంచాలన్నది యాజమాన్యం యోచనగా తెలుస్తోంది. ఎంఎస్ఎంఈ సెక్టార్‌లో రూ. 25 వేల కోట్ల మేర రుణాలనిచ్చేందుకు పైప్‌లైన్ అనుమతులు కూడా బ్యాంక్ ఇప్పటికే ఇచ్చేసి ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మంచి ఎంఎస్ఎంఈలకు,  ఎఫ్ఎంసీజీ,ఇన్ఫ్రా, ఫార్మా కంపెనీలకు రుణాలనిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వినవస్తోంది. బ్యాంక్ కాసా( కరంట్,సేవింగ్స్ అక్కౌంట్ నంబర్లు) 54 శాతం పెరగడం ఓ ప్లస్ పాయింట్ కాగా, క్యూ4లో 41 శాతానికి పైగా లాభంతో రూ. 550 కోట్లు గడించింది. ప్రస్తుతం మార్కెట్ కేపిటలైజేషన్ రూ. 17,500 కోట్లకు ఎగసింది. ఇది 2020 మార్చిలో రూ. 3,948 కోట్లు మాత్రమే.


అలానే ఎన్‌పీఏలు కూడా 2018 సెప్టెంబరుతో పోల్చితే 18.64శాతం నుంచి 7.23 శాతానికి తగ్గాయి.  ఈ ఆర్ధిక సంవత్సరంలోనే బ్యాంక్ మొత్తం ఎన్‌పీఏలను రెండు శాతానికంటే తక్కువకు  తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. శుక్రవారం( జాన్ 11,2021)నాటి ట్రేడింగ్‌లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర షేర్లు రూ. 26.60 వద్ద ముగిసాయి. 

Updated Date - 2021-06-13T22:53:50+05:30 IST