సొంతూళ్లో ఉండే బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకుని కంగుతిన్న Canada NRI.. అసలు విషయం ఆరా తీస్తే షాక్..

ABN , First Publish Date - 2021-08-27T03:28:50+05:30 IST

దొంగ చేతికి తాళాలిస్తే.. ఆ దొంగ ఇక దొంగతనం చేయలేడనేది పాత సామెత. ఇప్పుడు దొంగలు కూడా ముదిరిపోయారు. తాళాలు తమ చేతిలో..

సొంతూళ్లో ఉండే బ్యాంకు ఖాతాలో బ్యాలెన్స్ చెక్ చేసుకుని కంగుతిన్న Canada NRI.. అసలు విషయం ఆరా తీస్తే షాక్..

దొంగ చేతికి తాళాలిస్తే.. ఆ దొంగ ఇక దొంగతనం చేయలేడనేది పాత సామెత. ఇప్పుడు దొంగలు కూడా ముదిరిపోయారు. తాళాలు తమ చేతిలో ఉన్నా.. దొంగతనం జరిగితే తమమీదకే వస్తుందని తెలిసినా.. ఏ మాత్రం భయం లేకుండా దర్జాగా చోరీలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి సంఘటనే పంజాబ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. భాగ్ సింగ్.. కెనడాలో నివశించే ఓ ఎన్నారై. తాజాగా తన ఖాతాలోని సొమ్మును చెక్ చేసుకోగా దిమ్మతిరిగింది. ఖాతాలో ఉండాల్సిన లక్షల రూపాయల సొమ్ము ఉండాల్సి ఉండగా.. ఒక్క రూపాయి కూడా లేకుండా ఖాతా అంతా ఖాళీ అయింది. దీంతో షాక్‌కు గురైన సదరు ఎన్నారై.. పోలీసులను ఆశ్రయించారు. తన అన్న కొడుకులు చమ్‌కౌర్ సింగ్, బల్విందర్ సింగ్‌లపై ఫిర్యాదు చేశాడు.


కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. ఎన్నారై సొంత ఊరు మనావా గ్రామంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ అమిత్ కుమార్‌ను, బ్యాంక్ ఉద్యోగి ప్రశాంత్ శర్మలే మొత్తం సొమ్మును కాజేసినట్లు గుర్తించారు. దీంతో వారిద్దరినీ అదుపులోనికి తీసుకున్నారు. ఎన్నారై ఖాతాలో నుంచి నిందితులు దాదాపు రూ.27లక్షల నగదును మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా.. ఇద్దరినీ ఈ రోజు(గురువారం) స్థానిక న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కోర్టు విచారణపై వివరాలు తేలియాల్సి ఉంది.

Updated Date - 2021-08-27T03:28:50+05:30 IST