రిటైర్డ్ ఉద్యోగి బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు మాయం.. ఆ డబ్బులు ఎవరు కాజేశారంటే..

ABN , First Publish Date - 2022-02-23T05:46:51+05:30 IST

ఒక 73 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు దొంగతనం జరిగాయి. ఆ డబ్బులు ఎలా పోయాయో ఆ సీనియర్ సిటిజెన్‌కి అర్థం కాలేదు. ఆయన ఇంతకుమందు తన ఎటియం కార్డుని బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్‌కి ఇచ్చారు. తన ఖాతా నుంచి డబ్బులు ఎలా పోయాయో విచారణ చేయాలని ఆయన బ్యాంకు మేనేజర్‌ను అడిగారు. విచారణలో ఆ డబ్బులు కాజేసింది.. ఆ అసిస్టెంట్ మేనేజర్ అని తెలిసినా బ్యాంకు యజమాన్యం...

రిటైర్డ్ ఉద్యోగి బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బులు మాయం.. ఆ డబ్బులు ఎవరు కాజేశారంటే..

ఒక 73 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు దొంగతనం జరిగాయి. ఆ డబ్బులు ఎలా పోయాయో ఆ సీనియర్ సిటిజెన్‌కి అర్థం కాలేదు. ఆయన ఇంతకుమందు తన ఎటియం కార్డుని బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్‌కి ఇచ్చారు. తన ఖాతా నుంచి డబ్బులు ఎలా పోయాయో విచారణ చేయాలని ఆయన బ్యాంకు మేనేజర్‌ను అడిగారు. విచారణలో ఆ డబ్బులు కాజేసింది.. ఆ అసిస్టెంట్ మేనేజర్ అని తెలిసినా బ్యాంకు యజమాన్యం నిందితురాలిని కాపాడడానికి ప్రయత్నించింది.


వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గడ్ రాజధాని రాయ్‌పూర్‌లో నివసించే బద్రి మిశ్రా(73) అనే రిటైర్డ్ ఉద్యోగికి ఇండస్‌ఇండ్ బ్యాంకులో అకౌంట్ ఉంది. అయితే మిశ్రాకి 

ఎటియం కార్డు ఎలా ఉపయోగించాలో తెలియదు. అందువల్ల బ్యాంకులోనే డబ్బులు తీసుకునే వారు. కానీ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్‌ సుష్మిత త్రిపాఠీ  ఆయన అలా ప్రతీసారీ చేయడం చూసి.. తను ఆయనకు సహాయం చేస్తానని చెప్పింది. అందుకోసం మిశ్రా ఎటియం కార్డును తన వద్ద పెట్టుకుంది. ఆ తరువాత నుంచి మిశ్రా తనకు వ్యక్తి గత ఖర్చుల నిమిత్తం ఎంత అవసరం వచ్చినా సుష్మితకు చెప్పేవారు. ఆమె కావాల్సినంత డబ్బు అకౌంట్ నుంచి విత్ డ్రా చేసి ఇచ్చేది. 


మిశ్రాకు నెలనెలా పెన్షన్ డబ్బులు వచ్చేవి. వాటిలో కొంచెం తన వ్యక్తి గత ఖర్చులకు, మరి కొన్ని తన కుటుంబ సభ్యుల బీమా ప్రీమియం చెల్లించేందుకు మాత్రమే ఉపయోగించేవారు. అలాంటిది ఒకరోజు బీమా కంపెనీ నుంచి మిశ్రా ఇంటికి నోటిస్ వచ్చింది. ఆయన బీమా ప్రీమియం సమయానికి చెల్లించకపోవడంతో పెనాల్టీ కట్టాలని ఆ నోటిస్‌లో ఉంది.  ఆ నోటిస్ చూసి మిశ్రా ఆశ్చర్యపోయారు. తన బ్యాంకు ఖాతాలో సరిపడ డబ్బులున్నాయని ఆయన భావించారు. కానీ బీమా ప్రీమియం డబ్బులు ఎందుకు చెల్లించలేదో తెలుసుకోవడానికి బ్యాంకు అధికారులను అడిగారు. ఆయన ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేదని అధికారులు తెలిపారు. దీంతో మిశ్రా ఒక్కసారిగా షాకయ్యారు. తన డబ్బులు ఏమైపోయానని ప్రశ్నించారు. 


బ్యాంకు అధికారులు మిశ్రా తన డబ్బులన్నీ ఏటియం కార్డు ద్వారా తీసుకున్నారని చెప్పారు. కానీ తాను డబ్బులు తీయలేదని మిశ్రా వాదించారు. ఆ తరువాత మిశ్రా అసిస్టెంట్ మేనేజర్ సుష్మిత కోసం అడిగారు. ఆమె సెలవులో ఉన్నారని తెలసి.. మేనేజర్‌తో కలిసి తన డబ్బులు దొంగతనం జరిగాయంటూ ఫిర్యాదు చేశారు. అప్పుడు మేనేజర్ దర్యాప్తు చేయగా.. మిశ్రా ఖాతా నుంచి  అసిస్టెంట్ మేనేజర్ సుష్మిత డబ్బులు మొత్తం తీసుకుందని తెలిసింది. ఈ విషయం బయట ఎవరికీ తెలయకుండా ఉండేందుకు బ్యాంకు మేనేజర్ సుష్మితని పుణే శాఖకు ట్రాన్స్‌ఫర్ చేశారు. కానీ మిశ్రా తాను మోసపోయానని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేసి అసిస్టెంట్ మేనేజర్ సుష్మితను పుణే నుంచి అరెస్టు చేశారు.


Updated Date - 2022-02-23T05:46:51+05:30 IST