చెప్పినట్టు నడుచుకుంటేనే ఉద్యోగం

ABN , First Publish Date - 2020-04-10T10:57:36+05:30 IST

బ్యాంకులో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడాన్ని ఆసరాగా తీసుకుని మహిళను వేధించిన బ్యాంకు

చెప్పినట్టు నడుచుకుంటేనే ఉద్యోగం

మహిళను వేధించిన బ్యాంక్‌ మేనేజర్‌ అరెస్ట్‌ 


మిర్యాలగూడ అర్బన్‌, ఏప్రిల్‌ 9: బ్యాంకులో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడాన్ని ఆసరాగా తీసుకుని మహిళను వేధించిన బ్యాంకు మేనేజర్‌ను షీటీం గురువారం అరెస్ట్‌ చేసింది. త్రిపురారం మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన నూనె వెంకటేశ్వర్లు ఓ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తూ మిర్యాలగూడలో నివసిస్తున్నాడు.  ఇటీవల బ్యాంకు  ఉద్యోగ నోటిఫికేషన్‌ను చేసి పట్టణానికి చెందిన ఓ మహిళ దరఖాస్తు చేసుకుంది.్ల ఉద్యోగం దక్కాలంటే తను చెప్పినట్లు నడుచుకోవాలని ఆమెకు మేనేజర్‌ ఫోన్‌ చేస్తూ వేధిస్తున్నాడు. దీంతో ఆమె ఆన్‌లైన్‌లో షీటీంకు ఫిర్యాదు చేసింది. పోలీస్‌ ఆమె కాల్‌డేటా ఆధారంగా షీ టీం  బ్యాంకు మేనేజన్‌ను అరెస్టు చేసి విచారణ నిమిత్తం నల్లగొండకు తరలించారు.  వెంకటేశ్వర్లు ప్రవర్తనపై ఫిర్యాదులు రావడంతో గత నెలలో సదరు బ్యాంకు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.  

Updated Date - 2020-04-10T10:57:36+05:30 IST