రెండో రోజూ కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ABN , First Publish Date - 2021-12-18T16:29:21+05:30 IST

దేశంలో లాభాల్లో ఉన్న రెండు పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మె శుక్రవారమైన రెండో రోజు

రెండో రోజూ కొనసాగిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె

అడయార్‌(చెన్నై): దేశంలో లాభాల్లో ఉన్న రెండు పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశంలోని బ్యాంకు ఉద్యోగ సంఘాలు చేపట్టిన సమ్మె శుక్రవారమైన రెండో రోజు కూడా కొనసాగింది. దేశ వ్యాప్తంగా 80 వేల బ్యాంకు శాఖలకు చెందిన 9 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఒక్క తమిళనాడు రాష్ట్రంలో 15 వేల బ్యాంకు శాఖలకు చెందిన 80 వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. రెండు రోజుల పాటు సాగిన సమ్మె కారణంగా ముంబై, ఢిల్లీ, చెన్నై రీజియన్లలో రూ.74,400 కోట్ల నగదు లావాదేవీలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ సమ్మెలో పాల్గొన్న ఉద్యోగులంతా లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగానికి చెందిన రెండు బ్యాంకులను ప్రైవేటీకరణ చేయొద్దంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించారు.

Updated Date - 2021-12-18T16:29:21+05:30 IST