అతను ఒక బ్యాంకులో పని చేసే ఒక ఉద్యోగి. తనను బర్త్‌డే పార్టీకి పిలిచిన మహిళను ట్రాప్ చేశాడు.. ఆమె డ్రింక్‌లో మత్తు పదార్థాలు కలిపి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ ఘటనను వీడియో తీసి బెదిరింపులకు దిగాడు. రూ. 2 లక్షలు వసూలు చేశాడు.. అయినా మరింత డబ్బు కావాలని డిమాండ్ చేశాడు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళితే.. బిలాస్‌పూర్‌లోని ఓ బ్యాంకులో పని చేస్తున్న మహిళ గతేడాది తన కొలీగ్‌ను బర్త్ డే పార్టీకి ఆహ్వానించింది. అక్కడ ఆ మహిళ తాగే డ్రింక్‌లో నిందితుడు మత్తు పదార్థం కలిపాడు. ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ ఘటన మొత్తాన్ని వీడియో తీశాడు. ఆ వీడియో చూపించి ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. ఆమె నుంచి రూ.2 లక్షలు వసూలు చేశాడు. ఇంకా డబ్బులు కావాలని అడిగాడు. ఆ మహిళ ఇవ్వలేనని చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యాడు.
తన బ్యాంక్‌లోని వారందరికీ ఆ వీడియోను పంపించాడు. షాక్‌కు గురైన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అత్యాచారం కేసు పెట్టి రిమాండ్‌కు తరలించారు.
ఇవి కూడా చదవండి