క్రిస్మస్ రోజున కలకలం .. ఉద్యోగుల అకౌంట్లలో అకస్మాత్తుగా రూ. 1310 కోట్లు జమ.. ఆ తరువాత..

ABN , First Publish Date - 2022-01-02T01:56:02+05:30 IST

క్రిస్మస్ పర్వదినాన ఓ బ్యాంకులో జరిగిన తప్పిదం కారణంగా ఏకంగా రూ. 1310 కోట్లు కస్లమర్ల ఎకౌంట్లలోకి జమ అయ్యాయి.

క్రిస్మస్ రోజున కలకలం .. ఉద్యోగుల అకౌంట్లలో అకస్మాత్తుగా రూ. 1310 కోట్లు జమ.. ఆ తరువాత..

ఇంటర్నెట్ డెస్క్: క్రిస్మస్ పర్వదినాన ఓ బ్యాంకులో జరిగిన తప్పిదం కారణంగా ఏకంగా రూ. 1310 కోట్లు కస్లమర్ల అకౌంట్లలోకి జమ అయ్యాయి. బ్రిటన్‌కు చెందిన సంటాండర్ బ్యాంకులో ఈ ఘటన వెలుగు చూసింది. 75 వేల లావాదేవీల ద్వారా మొత్తం 2 వేల మంది కమర్షియల్ కస్టమర్ల అకౌంట్లలో ఈ లావాదేవీలు ప్రత్యక్షమయ్యాయి. అయితే.. జరిగిన తప్పిదాన్ని బ్యాంకు వెంటనే గుర్తించి కస్టమర్లకు క్షమాపణ తెలిపింది. ఈ లావేదేవీల కారణంగా డబ్బు ఎవరూ నష్టపోలేదని కూడా స్పష్టం చేసింది. టెక్నికల్ సమస్య కారణంగా కొందరి ఖాతాల్లో జరిపిన లావాదేవీలు ఇతరుల ఖాతాల్లోనూ కనిపించాయని వివరించింది. బ్రిటన్‌లోని ఇతర బ్యాంకుల సహాయంతో ఈ మొత్తాన్ని రికవర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు బ్యాంకు పేర్కొంది. 


ఈ పొరపాటు కారణంగా కొన్ని సంస్థల నుంచి ఉద్యోగుల అకౌంట్లలో రెండు మార్లు నగదు బదిలీ జరిగింది. దీంతో.. సదరు కంపెనీల్లోని కొందరు కీలక ఉద్యోగులు ఏం జరిగిందో అర్థం కాక కంగారు పడిపోయారు. ‘‘నా పండగ మొత్తం నాశనమైపోయింది. నా పొరపాటు కారణంగానే ఉద్యోగుల అకౌంట్లలోకి రెండు మార్లు నగదు బదిలీ అయ్యిందనుకుని కంగారు పడిపోయా..ఇప్పుడు ఇదంతా బ్యాంకు వారి తప్పిదమని బయటపడింది’’ అని ఓ ఉద్యోగి వాపోయారు. 

Updated Date - 2022-01-02T01:56:02+05:30 IST