వీర్.. మాలిక్.. పారిపోకుండా తెల్లారే వరకు పోలీసుల కాపలా

ABN , First Publish Date - 2021-04-10T21:59:58+05:30 IST

పోలీసుల పహారా మధ్య.. వీర్.. మాలిక్. పేర్లు చూస్తే పెద్ద దొంగల్లా ఉన్నారు. చేసిన నేరమేంటా అని ఆలోచనల్లో పడిపోయారా?

వీర్.. మాలిక్.. పారిపోకుండా తెల్లారే వరకు పోలీసుల కాపలా

హైదరాబాద్: పోలీసుల పహారా మధ్య.. వీర్.. మాలిక్. పేర్లు చూస్తే పెద్ద దొంగల్లా ఉన్నారు. చేసిన నేరమేంటా అని ఆలోచనల్లో పడిపోయారా? మరీ పెద్దగా ఊహించుకోకండి. ఇవి పొట్టేళ్లు. ఒక్కో దానికి ఒక్కో కానిస్టేబుల్‌ను కాపలా పెట్టడంతో... హాట్ టాపిక్‌గా మారాయి. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హకీంపేట్‌లో శుక్రవారం పొట్టేళ్ల పోటీలను అక్రమంగా నిర్వహించారు. పక్కా సమాచారంతో అక్కడికి వెళ్లిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. నిర్వాహకులను అరెస్ట్ చేశారు. 15 మంది నిర్వాహకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి నుంచి 60 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు పొట్టేళ్లను స్వాధీనం చేసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా... ఈ పొట్టేళ్లను అదుపుచేయడం మాత్రం పోలీసులకు తలనొప్పిగా మారింది. కట్టేస్తే.. తెంపుకుని పారిపోతాయేమోనన్న ఆలోచనతో.. స్టేషన్ వెనుక ఉన్న సిమెంటు బల్లలకు కట్టి పెట్టారు. అంతేగాక ఒక్కో పొట్టేలు దగ్గరా ఒక్కో కానిస్టేబుల్‌ను కాపలా పెట్టారు. అనంతరం వీటిని వెటర్నరీ హాస్పిటల్‌కు తరలించారు. 

Updated Date - 2021-04-10T21:59:58+05:30 IST