బంజారాహిల్స్‌లో..గజం రూ. 84,500

ABN , First Publish Date - 2021-07-23T08:29:08+05:30 IST

ప్రభుత్వం తాజాగా సవరించిన భూముల ధరలతో.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని దాదాపు అన్ని ప్రాంతా లు 30ు పెంపు పరిధిలోకి వచ్చాయి

బంజారాహిల్స్‌లో..గజం రూ. 84,500

ఫ్లాట్‌ ధర చదరపు అడుగుకు రూ. 7,800.. గ్రేటర్‌ హైదరాబాద్‌లో.. భూముల ధరలు పైపైకి

బోయిన్‌పల్లిలో గజం రూ.71,500

రెడ్‌హిల్స్‌లో  రూ.67,750.. 

మారేడ్‌పల్లిలో రూ. 66,500

ప్రాంతాలను బట్టి మారిన విలువలు

గజం రూ.20 వేలకు మించితే 30% పెంపు


హైదరాబాద్‌ సిటీ, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం తాజాగా సవరించిన భూముల ధరలతో.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని దాదాపు అన్ని ప్రాంతా లు 30ు పెంపు పరిధిలోకి వచ్చాయి. బంజారాహిల్స్‌లో ఈ నెల 19 వరకు ప్రభుత్వ విలువ గజానికి రూ. 65 వేలు ఉండగా.. ఇప్పుడు రూ. 84,500కు చేరుకుంది. చిక్కడపల్లిలో భూమి విలువ గజానికి రూ. 38 వేల నుంచి రూ. 49,500కు పెరిగింది. అంతేకాదు.. బంజారాహిల్స్‌లో అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ల చదరపు అడుగు విలువ మొన్నటి వరకు రూ. 5,740గా ఉండగా.. ఇప్పుడు ఏకం గా రూ. 7,600కు ఎగబాకింది. గ్రేటర్‌ హైదరాబాద్‌లో సింహభాగం ప్రాంతాల్లో చదరపు గజం ధర రూ. 20 వేలకు మించి ఉండడంతో.. ఆయా ప్రాంతాల్లో విలువ 30% మేర పెరిగింది. నిజానికి ప్రభుత్వం ప్లాట్ల విషయంలో మూడు స్లాబులను నిర్ణయించింది. లోయర్‌-రేంజ్‌ భూములపై 50%, మిడ్‌-రేంజ్‌పై 40%, హయ్యర్‌-రేంజ్‌పై 30% పెంచింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో విస్తరించిన గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎక్కువ శాతం భూములు హయ్యర్‌-రేంజ్‌లో ఉండడంతో.. 30ు బాదుడు అనివార్యమైంది. దీంతో.. ఇక్కడ ప్లాట్లు, ఫ్లాట్లు సామాన్యులకు అందనంత పైపైకి ఎగబాకాయి. స్థలాలను కొనుగోలు చేయడం ఒక ఎత్తైతే.. వాటి రిజిస్ట్రేషన్‌ చార్జీలు(7.5ు) కూడా ఇప్పుడు తడిసి మోపడవుతున్నాయి. 


స్థలాలు, ఫ్లాట్ల విలువలు ఇలా..

  • ఇప్పటి వరకు అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల సర్కారీ విలువ చదరపు అడుగుకు కనిష్టంగా రూ.800లుగా ఉండేది. అది కాస్తా ఇప్పుడు రూ. వెయ్యికి చేరింది. నగరంలో చాలా వరకు మిడ్‌, హయ్యర్‌ రేంజ్‌ అపార్ట్‌మెంట్లు ఉండడంతో.. వాటి సర్కారీ విలువలు 20-30ు మేర పెరిగాయి
  • జీహెచ్‌ఎంసీ పరిధిలో చదరపు గజానికి ఇంతకు ముందు కనిష్ఠ విలువ రూ.2వేలుగా ఉండేది. దాన్ని ఇప్పుడు 50ు పెంచి రూ. 3 వేలకు ఖరారు చేశారు. అలా.. రూ. 2 వేల నుంచి రూ. 10 వేల వరకు విలు వ ఉన్న భూములపై 50ు పెంపు ఉంటుంది
  • చదరపు గజం రూ.10వేల నుంచి రూ.20వేల వరకు ఉండే ప్రాంతాల్లో విలువను 40ు పెంచారు. ఈ కేటగిరీలో కనిష్ఠ విలువ రూ. 14 వేలుగా ఉండాలి. కానీ, దాన్ని రూ. 15 వేలకు పెంచారు. అంటే.. ఇప్ప టి వరకు గజం భూమి రూ. 10 వేలు ఉన్న ప్రాం తాల్లో ఆ ధర రూ. 15 వేలకు పెరిగింది
  • చదరపు గజం రూ.20వేలకు మించి ఉండే ప్రాంతా ల్లో భూముల విలువను 30ు పెంచారు. ఈ కేటగిరిలోనూ కనిష్ఠ విలువను చదరపు గజానికి రూ.28 వేలుగా నిర్ణయించారు. అంటే.. ఇప్పటి వరకు రూ.20వేలు విలువ ఉండే భూమి ఇప్పుడు రూ.28వేలకు చేరింది
  • హెచ్‌ఎండీఏ-1లోని రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి పరిధిలో కనిష్ఠ విలువ చదరపు గజానికి వెయ్యి ఉండగా.. దాన్ని రూ.1,500లకు పెంచారు. అదే.. హెచ్‌ఎండీఏ-2 పరిధిలోని సిద్దిపేట, మెదక్‌ ఇతర ప్రాంతాల్లో చదరపు గజం విలువ కనిష్ఠంగా రూ. 500ఉండగా.. రూ.800లకు పెరిగింది

భూముల ధరలు ఇలా..!

  • హెచ్‌ఎండీఏ పరిధిలో ఎకరం విలువ కనిష్ఠంగా రూ.3.35లక్షలు ఉన్న ప్రాంతాల్లో.. ధరలను రూ.5లక్షలకు పెంచారు
  • రూ.3.35లక్షల నుంచి రూ.10లక్షల వరకు ఉన్న ప్రదేశాల్లో.. లోయర్‌-రేంజ్‌ కింద 50ు పెంచారు
  • రూ.10లక్షల నుంచి కోటి వరకు విలువ ఉన్న భూ ముల ధరలను మిడ్‌-రేంజ్‌ కింద 40ు పెంచారు.  కనిష్ఠ విలువను రూ. 15 లక్షలుగా నిర్ణయించారు
  • ఎకరం భూమి ధర రూ. కోటికి మించిన ప్రాంతాల్లో 30ు మేర పెంపును ఖరారు చేశారు. ఇక్కడ కూడా కనిష్ఠ విలువను రూ. 1.30 కోట్లకు బదులు.. రూ.1.40కోట్లుగా నిర్ణయించారు

శివార్లలోనూ ధరల దడ..

ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలోని బండ్లగూడ ప్రాంతంలో మొన్నటివరకు ఎకరం భూమికి సర్కారీ విలువ రూ.14.52 కోట్లు ఉండేది. ఇప్పుడు అది కాస్తా రూ. 18.87 కోట్లకు చేరింది. ఐటీ హబ్‌ రాయదుర్గంలో ఎకరం విలువ రూ. 9.68 కోట్ల నుంచి రూ. 12.58 కోట్లకు పెరిగింది. శివార్లలోనూ భూముల విలువ అమాంతం పెరగడంతో.. ఆ ప్రభావం కొత్త లేఅవుట్లు, అపార్ట్‌మెంట్లపై పడే అవకాశాలున్నాయని రియల్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


నగరంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన భూముల ధరలు (చదరపు గజానికి రూ.లలో)

సబ్‌-రిజిస్ట్రార్‌ పరిధి గతంలో ప్రస్తుతం

జూబ్లీహిల్స్‌ 45,000 58,500

గోల్కొండ 65,000 84,500

రెడ్‌హిల్స్‌ 52,000 67,750

కూకట్‌పల్లి 30,000 39,000

మియాపూర్‌ 30,000 39,000

శేరిలింగంపల్లి 30,000 39,000

అత్తాపూర్‌ 20,000 28,000

బోయిన్‌పల్లి 55,000 71,500

మారేడ్‌పల్లి 51,000 66,500


ఏడేళ్ల తర్వాత పెంపు

రాష్ట్రంలో భూముల ధరలు ఏడేళ్ల తర్వాత పెరిగాయి. అయినా.. ప్రజల నుంచి ఎలాంటి ఆక్షేపణ రావడం లేదు. మా కార్యాలయంలో పెరిగిన ధరలు అమల్లోకి వచ్చిన తర్వాత తొలిరోజు(గురువారం) 35 డాక్యుమెంట్లను రిజిస్టర్‌ చేశాం. ప్రజలు కూడా యథావిధిగా సవరించిన రేట్లతో రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటున్నారు.

- ప్రణయ్‌కుమార్‌, సబ్‌-రిజిస్ట్రార్‌, ఎర్రగడ్డ

Updated Date - 2021-07-23T08:29:08+05:30 IST