Indore: గాజుల వ్యాపారిని చితక్కొట్టిన స్థానికులు

ABN , First Publish Date - 2021-08-23T17:57:04+05:30 IST

గాజుల విక్రయం పేరుతో మహిళలను లైంగికంగా వేధించాడనే ఆరోపణతో ఓ యువకుడిని స్థానికులు చితక్కొట్టిన వీడియో సోషల్ మీడియాలో...

Indore:  గాజుల వ్యాపారిని చితక్కొట్టిన స్థానికులు

ఇండోర్ (మధ్యప్రదేశ్): గాజుల విక్రయం పేరుతో మహిళలను లైంగికంగా వేధించాడనే ఆరోపణతో ఓ యువకుడిని స్థానికులు చితక్కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన ఓ యువకుడు గాజుల విక్రేత. గాజులు విక్రయించే యువకుడు తమ మహిళలను లైంగికంగా వేధిస్తున్నాడనే ఆరోపణతో అతన్ని కొట్టారు. దీంతో స్థానిక పురుషులు కొందరు గాజుల వ్యాపారిని కొట్టి అతని వద్ద ఉన్న గాజులు, ఇతర వస్తువులను విసిరేయడం, బాధితుడి నుంచి డబ్బు లాక్కుంటున్న వీడియో వెలుగుచూసింది. 


శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు పాలనలో దాడి చేసిన వారు ఉగ్రవాదులని యూపీ కాంగ్రెస్ నాయకుడు ఇమ్రాన్ ప్రతాప్ గర్హి ఆరోపించారు.‘‘ఇది అఫ్ఘానిస్థాన్ కాదని, ఇండోర్ నగరమని గాజుల విక్రేతను కొట్టి డబ్బు దోచుకున్నారని, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని’’ ఇమ్రాన్ ట్వీట్ లో కోరారు.కాగా సోషల్ మీడియాలో వీడియో వెలుగుచూడగానే బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఇండోర్ పోలీసులు చెప్పారు. తమ ప్రాంతంలో మరో వర్గానికి చెందిన యువకుడు గాజులు విక్రయిస్తున్నాడని అతన్ని కొట్టినట్లు ఫిర్యాదులో బాధిత వర్గీయులు పేర్కొన్నారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-08-23T17:57:04+05:30 IST