Bangladesh: పొట్టి ఆవు రాణి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన కొన్ని రోజులకే ఏమైందంటే...షాకింగ్

ABN , First Publish Date - 2021-10-01T16:11:22+05:30 IST

బంగ్లాదేశ్‌లో ప్రపంచంలోనే పొట్టి ఆవుగా పేరొందిన రాణి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన కొన్ని రోజులకే మరణించిన విషాద ఘటన జరిగింది...

Bangladesh: పొట్టి ఆవు రాణి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన కొన్ని రోజులకే ఏమైందంటే...షాకింగ్

ఢాకా (బంగ్లాదేశ్):బంగ్లాదేశ్‌లో ప్రపంచంలోనే పొట్టి ఆవుగా పేరొందిన రాణి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన కొన్ని రోజులకే మరణించిన విషాద ఘటన జరిగింది. రాణి అనే పేరుగల ఈ ఆవు 50.8 సెంటీమీటర్ల (20అంగుళాలు)ఎత్తుతో  భూమిపై అతి పొట్టి ఆవుగా గుర్తింపు పొందింది.ఈ పొట్టి ఆవు యజమాని అయిన కాజీ మొహమ్మద్ అబూ సుఫియాన్ గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం దరఖాస్తు చేశారు. ఈ పొట్టి ఆవును గిన్నిస్ వరల్డ్ రికార్డులో చేర్చినట్లు మొహమ్మద్ అబూకు ఈమెయిల్ వచ్చింది. 


అనంతరం ఈ పొట్టి ఆవును చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. గతంలో 61 సెంటీమీటర్లు ఉన్న మాణిక్యం అనే భారతీయ ఆవు రికార్డును బద్దలు గొట్టి బంగ్లాదేశ్ పొట్టి ఆవు రికార్డుల్లోకి ఎక్కింది. గ్యాస్ సమస్య వల్ల సెలబ్రిటీగా మారిన పొట్టి ఆవు మరణించడంతో దాని యజమాని మొహమ్మద్ కన్నీరుమున్నీరుగా రోదించారు. 


‘‘మేం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రిస్క్రిప్షన్లకు అనుగుణంగా రాణి ఆవు వీడియోలను పంపాం. ఆవు మృతి అసాధారణమైనది కాదని చెప్పడానికి మేం గిన్నీస్ బుక్ అధికారులకు పోస్ట్‌మార్టం నివేదికను కూడా పంపాం’’ అని సుఫియాన్ విలేఖరులకు చెప్పారు. ప్రపంచంలోనే అతి పొట్టి ఆవుగా గుర్తింపు పొందిన రాణికి తగిన గౌరవం లభించినా, దాని మరణంతో విచారంలో మునిగామని యజమాని మొహమ్మద్ చెప్పారు. 

Updated Date - 2021-10-01T16:11:22+05:30 IST